ఇస్మార్ట్ శంకర్ … ట్విట్టర్ ముచ్చట్లు

572
ismart shankar
- Advertisement -

దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో రామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ఇస్మార్ట్ శంకర్. నభా నటేశ్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించిన ఈచిత్రాన్ని పూరీ తన సొంత బ్యానర్ లో తెరకెక్కించారు. ఇప్పటికే ఈసినిమా నుంచి విడుదలైన ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. తాజాగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకురానుండగా ట్విట్టర్‌లో ఫ్యాన్స్‌ అప్పుడే రేటింగ్ ఇచ్చేశారు.

సినిమా విడుదలకు వారం ముందే దీనమ్మా కిక్కూ అంటూ ఫస్ట్ రివ్యూ అందించిన రామ్.. ఇవాళ నెటిజన్లతో ముచ్చటించారు. రామ్ అన్నా.. ఫ్యామిలీతో కలిసి ఇస్మార్ శంకర్ సినిమాకి వెళ్తున్నా.. చూడొచ్చంటావా? అంటే.. నిర్మొహమాటంగా చూడొచ్చు అనే ఆన్సర్ ఇచ్చారు రామ్.

ఇక మరోవైపు సినిమా చూసిన నెటిజన్లు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. అయితే మరికొంతమంది మాత్రం బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.గతంలో పూరీ డైరెక్షన్‌లో వచ్చిన ‘పోకిరి’, ‘దేశముదురు’, ‘బిజినెస్ మేన్’ ‘A’ సర్టిఫికేట్ రాగా బ్లాక్ బస్టర్‌ హిట్‌ కొట్టాయి. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకుంది.

- Advertisement -