గుమ్మ‌డికాయ కొట్టిన రామ్‌-పూరి

309
‘iSmart Shankar’
- Advertisement -

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేశ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం `ఇస్మార్ట్ శంకర్‌`. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కుడు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణంతా పూర్తి కావ‌డంతో శుక్ర‌వారం యూనిట్ గుమ్మ‌డికాయ కొట్టారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

‘iSmart Shankar’

రీసెంట్‌గా విడుద‌లైన ఈ చిత్ర టైల‌ర్‌కి టెరిఫిక్ రెస్పాన్స్ వ‌చ్చింది. రామ్ హైప‌ర్ పెర్ఫామెన్స్‌, పూరి మార్క్ డైలాగ్స్‌, టేకింగ్‌తో పాటు రామ్‌, పూరి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న తొలి చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత సారథ్యంలో విడుద‌లైన నాలుగు పాట‌ల‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. రాజ్ తోట ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు.

న‌టీన‌టులు:రామ్,నిధి అగ‌ర్వాల్‌,న‌భా న‌టేష్‌,పునీత్ ఇస్సార్‌,స‌త్య‌దేవ్‌,ఆశిష్ విద్యార్థి,గెట‌ప్ శ్రీను,సుధాంశు పాండే త‌దిత‌రులు.

- Advertisement -