ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `ఇస్మార్ట్ శంకర్`. శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరోలను మాస్ యాంగిల్‌లో సరికొత్తగా ప్రెజంట్ చేసే డైరెక్టర్ పూరి.. రామ్‌ను కూడా సరికొత్త లుక్‌లో చూపిస్తున్నారు. ఇప్పటికే రామ్ లుక్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
30రోజుల పాటు హైదరాబాద్‌లో జరుగుతున్న భారీ షెడ్యూల్ పూర్తయ్యింది. ప్రస్తుతం తదుపరి షెడ్యూల్ కో్సం టోటల్ యూనిట్ గోవా వెళుతుంది. అక్కడ మరో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు డైరెక్టర్ పూరి. హైదరాబాద్‌లో భారీ ఫైట్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను మే నెలలో విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
రామ్, నిధి అగర్వాల్, నభా నటేష్, పునీత్ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాంశు పాండే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: రియల్ సతీష్, సాహిత్యం: భాస్కరభట్ల, ఎడిటర్: జునైద్ సిద్ధికీ, ఆర్ట్: జానీ షేక్, సినిమాటోగ్రఫీ: రాజ్ తోట, మ్యూజిక్: మణిశర్మ, నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, దర్శకత్వం: పూరి జగన్నాథ్.