- Advertisement -
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసీస్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఐసీస్ సీనియర్ నాయకుడు బిలాల్ అల్ సుదానీ అమెరికా సైన్యం దాడిలో హతమయ్యాడు. ఉత్తర సోమాలియాలోని పర్వత గుహ కాంప్లెక్సులో ఉన్న సుదానీని పట్టుకునేందుకు అమెరికన్ పారామిలిటరీ దళాలు యత్నించాయి.
ఈ క్రమంలో సైన్యం జరిపిన కాల్పుల్లో సుదానీతోపాటు అతని సహచరులు మరో 10 మంది మంది హతమయ్యారని యూఎస్ సైనికాధికారులు ప్రకటించారు. ఈ ఆపరేషన్‌లో తమ సైనికులెవరూ గాయపడలేదని వెల్లడించారు.
గత డిసెంబర్లో ఐసిస్ చీఫ్ అబూ హసన్ అల్-హషిమీ అల్-ఖురేషి హతమైన సంగతి తెలిసిందే. ఇరాక్‌లో జరిగిన యుద్ధంలో ఖురేషీ హతమయ్యాడు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -