భారత్–న్యూజిలాండ్ మధ్య జరగనున్న వైట్‌బాల్ సిరీస్‌కు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. ఈ సిరీస్‌లో భాగంగా ముందుగా మూడు వన్డేలు, ఆపై ఐదు టీ20 మ్యాచ్‌లు జనవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. వన్డే ఫార్మాట్‌లో భారత జట్టుకు శుభ్‌మన్ గిల్ నాయకత్వం వహించనున్నారు.
అయితే ఈ వన్డే సిరీస్‌కు వికెట్‌కీపర్ ఎంపిక విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్‌కు ఈసారి అవకాశం దక్కేలా కనిపించడం లేదు. గతంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో కేఎల్ రాహుల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి 2-1తో సిరీస్‌ను గెలిపించిన సంగతి తెలిసిందే.
అజిత్ అగర్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ, కేఎల్ రాహుల్‌కు బ్యాకప్‌గా ఇషాన్ కిషన్ను రిజర్వ్ వికెట్‌కీపర్-బ్యాటర్‌గా తిరిగి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం విజయ్ హజారే ట్రోఫీలో ఇషాన్ ప్రదర్శనే కారణం. ప్రస్తుతం జార్ఖండ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న ఇషాన్ కిషన్, మధ్యక్రమంలో బ్యాటింగ్ చేస్తూ తన ఏకైక వన్డే మ్యాచ్‌లోనే అద్భుతమైన 125 పరుగులు సాధించాడు.
కొందరు సీనియర్ ఆటగాడైన పంత్‌కు తగిన అవకాశాలు ఇవ్వకుండా జట్టు నుంచి తప్పించడం సరికాదని భావిస్తుండగా, మరికొందరు అతడు షాట్ సెలెక్షన్‌పై స్థిరత్వం చూపించలేకపోతున్నాడన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న పంత్ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒక అర్ధశతకం మాత్రమే నమోదు చేశాడు.
Also Read:బళ్లారి వివాదం..ఎస్పీపై సస్పెన్షన్ వేటు

