Ind Vs Pak:ఇషాన్ సరికొత్త రికార్డు

3
- Advertisement -

టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్‌పై జరిగిన మ్యాచ్‌లో భారత స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. తన అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ (POTM) అవార్డు గెలుచుకున్న ఇషాన్, టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఈ అవార్డు అందుకున్న తొలి భారత వికెట్‌కీపర్‌గా నిలిచాడు. మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, భారత్ పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తూ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్ ఇషాన్ కిషన్ అద్భుత ఆరంభం అందించాడు. కేవలం 40 బంతుల్లో 77 పరుగులు చేసి భారత ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశాడు. అతని ఇన్నింగ్స్‌తో టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 175 పరుగులు చేసింది.భారత్ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన పాకిస్థాన్ జట్టును 114 పరుగులకే కట్టడి చేసి, 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ సూపర్ 8 దశకు అర్హత సాధించింది.

తన అద్భుత ప్రదర్శనకు గాను ఇషాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. దీంతో టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఈ అవార్డు గెలుచుకున్న తొలి భారత వికెట్‌కీపర్ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. వికెట్ అంత సులభం కాదు. కొన్ని సందర్భాల్లో మీ బలాలపై నమ్మకం ఉంచాలి అని ఇషాన్ ఈ సందర్భంగా తెలిపారు. నేను బంతిని గమనిస్తూ, నా బలాలను అనుసరించాను. వీలైనంత ఎక్కువ పరుగులు తీసే ప్రయత్నం చేశాను. ఆఫ్‌సైడ్ ఆటపై చాలా శ్రమ పెట్టాను, దాంతో బౌలర్లు ఎక్కడ బౌలింగ్ చేయాలో నేను నిర్ణయించగలిగాను అన్నాడు.

Also Read:నాగబంధం..బైరాగిగా గరుడ రామ్‌

- Advertisement -