ధర్మేంద్ర మృతి చెందలేదు:ఇషా డియోల్

5
- Advertisement -

తన తండ్రి ధర్మేంద్ర మృతి వార్తలను ఖండించారు ఆయన కూతురు ఇషా డియోల్. ప్రముఖ బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర మృతి చెందారంటూ పలు మీడియాల్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

నాన్న ఆరోగ్యంగానే ఉన్నారని, మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదంటూ ఆయన కూతురు ఈషా డియోల్ పోస్ట్ చేశారు. ధర్మేంద్రకు ఇద్దరు భార్యలు ప్రకాశ్ కౌర్, హేమమాలిని అని తెలిసిన సంగతి తెలిసిందే.

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘షోలే’లో వీరూ పాత్రలో నటించారు ధర్మేంద్ర. అలీబాబా ఔర్ 40 చోర్, దోస్త్, డ్రీమ్ గర్ల్, సన్నీ, గాయల్, లోఫర్ తదితర చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు ధర్మేంద్ర.

Also Read:ఢిల్లీలో బాంబు పేలుడు..

- Advertisement -