వామ్మో జగన్ కు ఇన్ని సమస్యలా.. ఇబ్బందే !

43
- Advertisement -

ఏపీ సి‌ఎం జగన్మోహన్ రెడ్డిని లెక్కకుమించి సమస్యలు చుట్టుముట్టాయి. ఈ సమస్యల భారీ నుంచి ఎటు బయటపడాలో తేల్చుకోలేనంతాగా ఆయనను ఇబ్బంది పెడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ విజయఢంఖా మోగించాలని ఒకవైపు కలలు కంటుంటే మరోవైపు ఆయనను చుట్టుముట్టిన సమస్యలు.. ఆ కలలను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాయి. కుటుంబంలో విభేదాలు, బాబాయ్ వివేకా కేసు, కోడి కత్తి కేసు, ప్రజల్లో వ్యతిరేకత, ప్రతిపక్షాల విమర్శలు, సొంత పార్టీ నేతల తిరుగుబాటు.. అబ్బో ఇలా ఒక్కటేంటి జగన్ ను అష్టదిగ్భంధం చేసిన సమస్యలు చాలానే ఉన్నాయి. అధికారం చేపట్టినది మొదలుకొని గత నాలుగేళ్లుగా సంక్షేమమే ప్రధాన ఎజెండాగా పథకాలు అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు జగన్.

అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే ఇచ్చిన హామీలన్నీ దాదాపు 90 శాతం అమలు చేశామని అందువల్ల వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు తమకే పట్టం కడతారని ధీమాగా ఉన్న జగన్ కు ఒక్కసారిగా గత ఏడాది కాలం నుంచి షాకులు తగులుతూనే ఉన్నాయి. కుటుంబంలో వెభేదాల కారణంగా ఆయన చెల్లెళ్ళు వైఎస్ షర్మిలా ఆంధ్ర విడిచి తెలంగాణలో ప్రత్యేక పార్టీ పెట్టి తెలంగాణలోనే సెటిల్ అయ్యారు. ఇక తల్లి విజయమ్మ కూడ వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసి షర్మిలతోనే ఉంటున్నారు. ఇలా చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ దూరం కావడానికి మెయిన్ రిజన్ జగనే అనే వాదన ఎప్పటి నుంచో ఉంది. ఇక ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న వివేకా మర్డర్ కేసు ప్రస్తుతం వేగంగా సాగుతూ జగన్ వైపు తిరిగేలా కనిపిస్తోంది. ఇది చాలదన్నట్లుగా కోడికత్తి వ్యవహారం కూడా జగన్ ను ఇబ్బంది పెడుతోంది.

గత ఎన్నికల ముందు జరిగిన కోడి కత్తి దాడి జగన్ వ్యూహంలో భాగమే అనే వాదన బలపడుతోంది. ఇవన్నీ కూడ వచ్చే ఎన్నికల్లో వైసీపీపై తీవ్ర ప్రభావం చూపే అంశాలే. ఇవి చాలదన్నట్లుగా పార్టీలో కూడ జగన్ పై ధిక్కార స్వరం వినిపిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే ఎమ్మేల్యేలు జగన్ వైఖరిపై తీవ్ర విమర్శలు చేస్తూ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. మరోవైపు గడపగడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల్లోకి వెలుతున్న ఎమ్మెల్యేలకు ప్రజలు చీవాట్లు పెడుతున్నారు. ఇంకోవైపు ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇన్ని లెక్కకు మించిన సమస్యలు జగన్ ను ఊపిరిపీల్చుకోలేనంతా చుట్టుముట్టాయి. ఇవన్నీ కూడా వచ్చే ఎన్నికల్లో వైసీపీపై తీవ్ర ప్రభావం చూపే అంశాలే. మరి వీటన్నిటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా బయటపడతారో చూడాలి.

- Advertisement -