తెల్లజుట్టు అనారోగ్యానికి సంకేతమా?

20
- Advertisement -

నేటి రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా తెల్ల జుట్టు సమస్య వేధిస్తుంది. చిన్నపిల్లల్లోనూ జుట్టు నెరసిపోవడం సర్వసాధారణం అయింది. అయితే కొందరిలో ఈ తెల్ల జుట్టు సమస్య జన్యు పరమైన లోపం వల్ల సంక్రమిస్తే.. మరికొందరిలో పోషకాహార లోపం వల్ల కూడా ఈ సమస్య కనిపిస్తుంది. అయితే చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడం వల్ల ఏదైనా అనారోగ్యానికి సంకేతమా అని చాలమంది భయపడుతుంటారు. నిజానికి జుట్టు సంక్రక్షణ కోసం మనం వాడే షాంపులు, సబ్బులు, ఇతరత్రా క్రీమ్స్ వంటివి అధికంగా యూస్ చేయడం వల్లనే తెల్ల జుట్టు ఏర్పడుతుందని కొన్ని అద్యయానాలు చెబుతున్నాయి. కాబట్టి తెల్ల జుట్టు విషయంలో భయాందోళనకు లోనవకుండా సహజసిద్దమైన సూచనలు పాటించడం వల్ల తెల్ల జుట్టు సమస్యను అధిగమించవచ్చని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. ముఖ్యంగా జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషక పదార్థాలను ఆహార డైట్ లో చేర్చుకోవాలి..

జుట్టు సంరక్షణకు గుడ్డు ఎంతగానో ఉపయోగపడుతుంది. గుడ్డులోని ప్రోటీన్లు జుట్టుకు బలాన్ని చేకూర్చి తెల్ల జుట్టును దూరం చేస్తాయి. ఇంకా పెరుగులో ఉండే విటమిన్ బి12 జుట్టును నల్లగా ఉంచడంలో సహాయ పడుతుంది. ఇంకా జుట్టు సంరక్షణకు ఉసిరి కూడా ఎంతగానో మేలు చేస్తుంది.. కాబట్టి తినే ఆహారంలో ఏదో ఒక రూపంలో ఉసిరి ఉండేలా చూసుకుంటే జుట్టుకు ఎంతో మేలట. నల్లనువ్వులలో కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. అంతేకాకుండా జుట్టుకు మేలు చేసే మేలనిన్ మూలకం ఉంటుంది. కాబట్టి నల్లనువ్వులను కూడా ఆహారంలో భాగం చేసుకుంటే జుట్టు సంరక్షణకు మంచిది. ఇవే కాకుండా ఎండు ద్రాక్ష, చేపలు వంటివి కూడా తెల్ల జుట్టును నిర్మూలించడంలో మంచి ఫలితాలను ఇస్తాయి. కాబట్టి ఆహార డైట్ లో జాగ్రత్తలు పాటిస్తూనే.. సల్ఫెట్ తక్కువగా ఉండే షాంపులను ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టును అరికట్టవచ్చు.

Also Read:చింతపండుతో ఉపయోగాలు తెలుసా?

- Advertisement -