కామారెడ్డి బరిలో రాములమ్మ..నిలబడేనా?

64
- Advertisement -

తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలు దగ్గర పడడంతో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది రాష్ట్ర ప్రజల్లో ఆసక్తిగా మారింది. ఇప్పటికే బి‌ఆర్‌ఎస్ తొలి జాబితా ప్రకటించి ఎలక్షన్ మూడ్ లోకి వచ్చేసింది. ఇక మిగిలిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా త్వరలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. కాగా ఆయా పార్టీలలోని కీలక నేతలు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా బీజేపీలో విజయశాంతి పోటీ చేసే స్థానంపై ఇప్పుడు హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి ఓటమి చవి చూసిన రాములమ్మ.. లోక్ సభ ఎన్నికల్లో మాత్రం గెలిచింది. .

గత కొన్నాళ్లుగా ఆమె ఈ సారి కూడా లోక్ సభ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేస్తారని మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ కోసం ట్రై చేస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం ఆమె మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిస్తే రాజకీయంగా యాక్టివ్ గా ఉండొచ్చనే ఆలోచనలో రాములమ్మ ఉన్నారట. అయితే అమెకంటూ ఒక బలమైన నియోజిక వర్గం లేకపోవడం పెద్ద మైనస్ గా మారింది. దీంతో ఆమెకు అధిష్టానం టికెట్ ఇస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకమే.

అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆమె కామారెడ్డి నుంచి పోటీ చేసే అవకాశం ఉండట. తాజాగా ఈ విషయంపై ఆమె స్పందిస్తూ తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది అధిష్టానం నిర్ణయిస్తుందని, అధిష్టానం ఎక్కడ నిర్దేశించిన అక్కడి నుంచి పోటీ చేస్తానని ఆమె చెప్పుకొచ్చారు. ఒకవేళ కామారెడ్డి నుంచి రాములమ్మ బరిలోకి దిగితే ఆమె గెలుపు అందని ద్రాక్షే. ఎందుకంటే కామారెడ్డి బరిలో బి‌ఆర్‌ఎస్ అధినేత సి‌ఎం కే‌సి‌ఆర్ ఉన్నారు. కే‌సి‌ఆర్ ను ఢీ కొట్టి నిలవడం అంతా తేలికైన విషయం కాదు. మరి కామారెడ్డి నుంచి పోటీ చేసే సాహసం రాములమ్మ చేస్తుందా లేదా అనేది చూడాలి.

Also Read:పవన్ కు షాకిచ్చిన శృతి హాసన్?

- Advertisement -