వెంకీ, నాగ్.. హిట్ కొట్టేనా?

17
- Advertisement -

ఈ ఏడాది సంక్రాంతి పోరు రసవత్తరంగా మారింది. ఏకంగా నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తలపడబోతున్నాయి. ముందుగా రేస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం ఉండగా, ఆ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న హనుమాన్ ఉంది. ఈ రెండు సినిమాలతో పాటు సీనియర్ స్టార్ హీరోలైన విక్టరీ వెంకటేష్ ‘సైంధవ్’, కింగ్ నాగార్జున ‘ నా సామిరంగా ‘ మూవీస్ కూడా పోటీలో ఉన్నాయి. అయితే గుంటూరు కారం, హనుమాన్ మూవీస్ తో పోల్చితే, వెంకీ సైంధవ్, నాగ్ నా సామిరంగా మూవీస్ కి పెద్దగా బజ్ లేదనే చెప్పాలి. గత కొన్నాళ్లుగా ఈ ఇద్దరి సీనియర్ హీరోల మూవీస్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాలు సాధించడం లేదు. వెంకీమామ తర్వాత వెంకటేష్ కు సరైన విజయం లేదు. .

ఇక నాగార్జున విషయానికొస్తే.. ఈ మధ్య నాగ్ చేసిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడుతూ వస్తున్నాయి. దీంతో వీరిద్దరు ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో సంక్రాంతి రేస్ లో వీరి సినిమాలను బరిలో దించి రిస్క్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది పైగా సంక్రాంతి రేస్ లో మహేష్ బాబు ఉన్నప్పటికి వెంకీ, నాగ్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దాంతో సైంధవ్, నా సామిరంగా మూవీస్ కి ఏ మాత్రం డివైడ్ టాక్ వస్తే.. మరో ఫ్లాప్ ను మూటగట్టుకోవాల్సి వస్తుంది. అయితే అటు సైంధవ్ టీమ్ ఇటు నా సామిరంగా టీమ్ వారి మూవీస్ పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సైంధవ్ 13న రిలీజ్ కానుండగా, నా సామిరంగా 14 విడుదల కాబోతుంది. మరి ఈ రెండు సినిమాలతో వెంకీ, నాగ్ ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి.

Also Read:నెల రోజుల పాలన సంతృప్తా? అసంతృప్తా?

- Advertisement -