Jagan:జగన్ కు వాలెంటిర్లతో నో యూజ్!

28
- Advertisement -

దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ వ్యవస్థను ప్రవేశ పెట్టి.. ప్రభుత్వ పథకాలను చేరవేయడంలో ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా వాలెంటర్లను మార్చమని ఏపీ ప్రభుత్వం ఎంతో గర్వంగా చెబుతూ వస్తోంది. అయితే వాలంటీర్ వ్యవస్థ కు చట్టబద్ధత లేకుండానే ప్రభుత్వ కార్యకలాపాలలో ఉపయోగించుకుంటుంది జగన్ సర్కార్. అయితే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి పార్టీ పరంగా కూడా వాలెంటర్లను జగన్ ఉపయోగించుకుంటున్నారనే వాదన మొదటి నుంచి వినిపిస్తూనే ఉంది. జగన్ అమలు చేస్తున్న పథకాలను పార్టీ పరంగా పబ్లిసిటీ చేసేలా వాలెంటీర్లకు దిశానిర్దేశం చేస్తున్నారనే వాదన కూడా గత కొన్నాళ్లుగా వినిపిస్తోంది. ఇక ఎన్నికలు దగ్గర పడడంతో ఎన్నికల ప్రచారల్లోనూ వాలెంటిర్లను జగన్ ఉపయోగించుకొనున్నారా ? అనే ప్రశ్నలు తరచూ ఎదురవుతూనే ఉన్నాయి. అయితే ఎన్నికల కార్యకలాపాలలో వాలంటీర్లు పాల్గొనరాదని ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఇటీవల స్పష్టం చేశారు. .

గతంలో కూడా వాలంటీర్లు దూరంగా ఉండాలని ఈసీ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. అదే విషయాన్ని మరోసారి నొక్కి చెప్పడంతో ఇక వాలెంటిర్ల విషయంలో వైసీపీ అధిష్టానం ఎలా ముందడుగు వేయనుందనేది ఆసక్తికరంగా మారింది. ఈసారి ఎన్నికల్లో వైసీపీ 175 సీట్లలో విజయం సాధించాలనే టార్గెట్ పెట్టుకుంది. ఆ స్థాయి విజయం దక్కాలంటే రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి జగన్ పాలన గురించి చెప్పి ప్రజా మద్దతు కూడగట్టాల్సి ఉంటుంది. ఆ విధంగా ప్రజామద్దతును ఓటుగా మలిచినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే వీలు ఉంటుంది. అలా చేయడంలో వాలెంటిర్లు బెస్ట్ ఆప్షన్ కానీ ఈసీ ఇచ్చిన షాక్ తో వారు ఎన్నికల కార్యకలాపాలకు దూరం కానున్నారు. ఈ నేపథ్యంలో వాలెంటిర్లు ఎన్నికల కార్యకలాపాలకు దూరమైతే వైసీపీకి గట్టి దేబ్బే అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. దీంతో వైసీపీ చేతిలో ఉన్న వాలెంటిర్ల వల్ల జగన్ కు ఎలాంటి ఉపయోగం లేదనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట.

Also Read:లవ్ గురు..అందమైన లవ్‌స్టోరి

- Advertisement -