ట్రంప్‌కి మానసిక రుగ్మతలా..?

263
Is Trump mentally ill ?
- Advertisement -

డొనాల్డ్ ట్రంప్ ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలకు ఇప్పుడు వణుకుపుడుతోంది. ముఖ్యంగా ముస్లిం దేశాలపై ఉక్కు పాదం మోపుతున్న ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలతో రోజు రోజుకి నిరసనలు పెరిగిపోతున్నాయి. ఎన్నికల సమయంలో ట్రంప్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా మహిళలను కించపరచడం,మీడియాపై మండిపడటంతో ట్రంప్‌ మానసిక స్ధితిపై డెమెక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి హిల్లరీ సైతం సందేహం వ్యక్తం చేసింది. ట్రంప్‌ మానసిక రోగని ఘాటుగా విమర్శించింది.

జర్మనీ మాజీ నియంత ఆడాల్ఫ్‌ హిట్లర్‌ కన్నా పెద్ద మానసిక రోగి అమెరికా రిపబ్లికన్‌ అధ్యక్ష అభ్యర్ధి డొనాల్డ్‌ ట్రంప్‌ అని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ అధ్యయనం కూడా వెల్లడిం చింది. స్టాండర్డ్‌ సైకోమెట్రిక్‌ టూల్‌ – సైకోపాథటిక్‌ పర్సనాలిటీ ఇన్వెంటరీ – రివైజ్డ్‌ (ఆర్‌పిఐ-ఆర్‌)ను ఉపయోగించి సర్వే చేయగా ట్రంప్ మానసిక స్ధితిపై ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. నిర్భీతి, దయా హృదయం, అహంకారం, నిర్దాక్షిణ్యం, ఆత్మ విశ్వాసం, చరిష్మా, నిజాయితీగా లేకపోవడం, సానుభూతి, ఆత్మ విచక్షణ కొరవడడం వంటి ఎనిమిది అంశాలపై పరిశీలన చేయగా ట్రంప్‌ పెద్ద మానసిక రోగని తేల్చింది ఈ సర్వే. ట్రంప్ మాన‌సిక స్థితిపై ఆందోళ‌న వ్య‌క్తం కావ‌డం ఇదే తొలిసారి కాదు.

Is Donald Trump mentally ill ?

ప్ర‌తిష్టాత్మ‌క హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీ డాక్ట‌ర్లు సైతం ట్రంప్ ఆరోగ్య స్ధితిపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు గతంలో బరాక్ ఒబామాకు లేఖ రాశారు. ట్రంప్ అధ్యక్ష బాధ్య‌త‌లు చేప‌ట్టేలోపు ఆయ‌న‌కు పూర్తి ఆరోగ్య‌, మాన‌సిక ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని లేఖ‌లో కోరారు. ఓ ప్ర‌ముఖ వ్య‌క్తిని నేరుగా క‌ల‌వ‌కుండా ఆయ‌న‌కు రోగ నిర్ధార‌ణ చేయ‌డం వృత్తిప‌రంగా స‌రైంది కాదు. కానీ ఆయ‌న మానిసిక అస్థిర‌త‌ను సూచించే కొన్ని ఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ లేఖ రాస్తున్నామని వారు తెలిపారు.

ట్రంప్ ఆడంబ‌ర‌పు మాట‌లు, ముందుచూపు లేని వైఖ‌రి, విమ‌ర్శ‌ల‌కు స్పందించే తీరు, కల్పితానికి, వాస్త‌వానికి తేడా తెలుసుకోలేని అస‌మ‌ర్థ‌త చూస్తే ట్రంప్ అధ్యక్ష బాధ్య‌త‌లు స్వీక‌రించేందుకు మాన‌సికంగా పూర్తిగా ఫిట్‌గా ఉన్నారా అన్న అనుమానాలు క‌లుగుతున్నాయి అని ఆ లేఖ‌లో ప్రొఫెస‌ర్లు పేర్కొన్నారు.

ఆగ‌స్టులో ఒబామా కూడా ట్రంప్ మానసిక స్థితిని ప్ర‌శ్నించారు. ఆయ‌న అధ్యక్షుడు కావడానికి అన్‌ఫిట్ అంటూ వ్యాఖ్యానించారు. సర్వేలు తేల్చిన విధంగానే ట్రంప్ పనితీరు కనబడుతుండటంతో ఇప్పుడు ఈ సర్వే అంశాలు పెద్ద చర్చనీయాంశమయ్యాయి.

- Advertisement -