Jagan: జగన్ పై దాడి..వ్యూహంలో భాగమేనా?

21
- Advertisement -

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తాజాగా జరిగిన రాళ్ల దాడి దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. బస్సు యాత్రలో భాగంగా నియోజకవర్గాల వారీగా సుడిగాలి పర్యటనలు చేస్తున్న జగన్ కు తాజాగా కృష్ణ జిల్లాలో ఊహించని పరాభవం ఎదురైంది. జనసందోహంలో కొందరు ఆగంతకులు ఆయన పైకి రాళ్ళు విసరడంతో ఆయన నుదుటిపై గాయం అయింది. దీంతో ప్రస్తుతం ఈ రాళ్ళ దాడి ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ దాడి వెనుక టీడీపీ హస్తం ఉండని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ ప్రచారంలో వస్తున్న జనసందోహం చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు దాడి చేయించారని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే ప్రజల్లో సానుభూతి కోసం జగనే దాడి చేయించుకున్నారని, ఇది పక్కా జగన్ వ్యూహమేనని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ దాడి వెనుక ఉన్న అసలు నిజాలు ఎంటనేది అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉంచితే గత ఎన్నికల ముందు కూడా వైఎస్ జగన్ పై కోడి కత్తి దాడి జరిగిన సంగతి విధితమే. విశాఖ ఎయిర్ పోర్ట్ లో అది కూడా వీఐపీ లంచ్ లో కోడి కత్తి దాడి జరగడం అప్పట్లో పెను సంచలనం అయిన సంగతి తెలిసిందే. దాడికి పాల్పడిన శీను జగన్ అభిమాని అని ఆయన కోసమే దాడి చేసినట్లు శీను ఒప్పుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. దీంతో వ్యూహాత్మకంగానే జగన్ తనపై తానే దాడి చేయించుకున్నారనే వాదన బలపడుతూ వచ్చింది. సరిగ్గా ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికల ముందు జగన్ పై రాళ్ళ దాడి జరగడంతో ఇది కూడా జగన్ వ్యూహంలో భాగమే అనేది ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న విమర్శ. అయితే వ్యూహమేదైనా 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారం సాధించింది. మళ్ళీ ఇప్పుడు ఎన్నికల ముందు జగన్ పై జరిగిన దాడి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. మరి తాజాగా జరిగిన దాడి జగన్ ఈ ఎన్నికల్లో అనుకూల ఫలితాలను ఇస్తుందా లేదా ప్రతికూల ఫలితాలను ఇస్తుందా అనేది చూడాలి.

Also Read:BJP Manifesto:హైలైట్స్ ఇవే

- Advertisement -