ఇకపై అప్పుల ఊబిలో తెలంగాణ?

50
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంగతి విధితమే. ఆరు గ్యారెంటీ హామీలను ప్రకటించి ప్రజల దృష్టిని ఆకర్షించిన హస్తం పార్టీ.. వాటివల్లే అధికారంలోకి వచ్చిందనే సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఇప్పుడు వాటి అమలుపై కాంగ్రెస్ ఎలా దృష్టి సారించనుందనేదే కీలకంగా మారిన అంశం. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.2500 ఆర్థికసాయం, రైతుభరోసా కింద ఎకరానికి రూ.15000, వ్యవసాయ కూలీలకు రూ.12000 అలాగే చేయూత కింద రూ. 4000 పెన్షన్.. ఇంకా ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం.. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రకటించిన ప్రతి హామీ కూడా నగదు జమకు సంబంధించినవే కావడంతో వీటి అమలు కోసం వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. .

రాజకీయ విశ్లేషకులు చెబుతున్నదాని ప్రకారం ఆరు గ్యారెంటీ హామీలు అమలైతే ప్రతి ఏటా దాదాపు రూ.88 వేల కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా. అలా చూస్తే ప్రజలపై పెను ఆర్థిక భారం పడడం గ్యారెంటీ అనేది కొందరు రాజకీయవాదులు చెబుతున్నా మాట. ప్రస్తుతం తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. దేశంలో ఏ రాష్ట్రం సాధించలేనంతగా పురోగతి సాధించింది. కే‌సి‌ఆర్ పాలనలో అన్నీ రంగాల్లోనూ తెలంగాణ అగ్రగామిగా నిలుస్తూ వచ్చింది. ఇకపై కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఎలా ఉండబోతుందనేది అందరినీ కలవర పెడుతున్న అంశం. ఇకపోతే ఓవరాల్ గా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీల ప్రభావంతో తెలంగాణ అప్పుల ఊబిలోకి పడిపోవడం ఖాయమేమో అనే సందేహాలు కూడా వ్యక్తమౌతున్నాయి. మరి తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూడాలి.

Also Read:Congress: టీమ్ రేవంత్ ఇదే!

- Advertisement -