పవన్‌తో మంతనాలు ఫలిస్తాయా?

50
- Advertisement -

తెలంగాణ ఎన్నికలు దగ్గర పడడంతో ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతూ అస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. ఇటీవల బీజేపీ ఆలస్యంగా తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. 52 మంది అభ్యతులకు తొలి జాబితాలో స్థానం కల్పించిన బీజేపీ రెండో జాబితాను ఈ రెండు మూడు రోజుల్లో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా తెలంగాణలో ఇతర పార్టీలతో పొత్తు విషయంలో నిన్న మొన్నటి వరకు ఆచితూచి అడుగులు వేసిన కమలనాథులు ఇప్పుడు పొత్తు కోసం వెంపర్లాడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జనసేనతో కలిసి నడిచేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. ఆల్రెడీ ఏపీలో ఈ రెండు పార్టీలు పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. .

కానీ తెలంగాణలో మాత్రం బీజేపీ జనసేన పొత్తు పెట్టుకునే అవకాశం లేదని, ఒంటరిగానే బిజెపి బరిలోకి దిగుతుందని గతంలో బండి సంజయ్ వంటి వారు చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. కర్నాటక ఎన్నికల్లో ఓటమి తరువాత బీజేపీ పూర్తిగా డీలా పడింది. దానికి తోడు తెలంగాణలో పార్టీ ప్రభావం చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. నియోజిక వర్గాల వారీగా అభ్యర్థుల కూడా తీవ్రంగానే వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ఒంటరిగా బరిలోకి దిగితే బీజేపీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందనే భయం పార్టీ పెద్దల్లో ఉందట. అందుకే తెలంగాణలో కూడా పోటీ చేస్తున్న జనసేనతో పొత్తు పెట్టుకోవాలని కమలనాథులు ప్రయత్నిస్తునట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేడు డిల్లీలో పార్టీ పెద్దలతో భేటీ కానున్నారు. ప్రధానంగా పొత్తు విషయంలోనే చర్చించనున్నరట. అంతకు ముందు తెలంగాణలో 32 స్థానాల్లో పోటీ చేయన్నట్లు జనసేన ప్రకటించింది. ఒకవేళ బీజేపీ జనసేన మద్య పొత్తు కుదిరితే సీట్ల కేటాయింపులో పునః ఆలోచించాల్సి వుంటుంది. మరి పవన్ తో బీజేపీ చేస్తున్న మంతనాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

Also Read:Bigg Boss 7 Telugu:ఈ వారం నామినేషన్స్‌లో 8మంది

- Advertisement -