2026 టీ20 ప్రపంచకప్ సూపర్ ఎయిట్ దశలో వెస్టిండీస్ జింబాబ్వేపై 107 పరుగుల భారీ విజయం సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో విండీస్ జట్టు 254/6 భారీ స్కోర్ నమోదు చేసింది. ఇది టీ20 ప్రపంచకప్ చరిత్రలో రెండో అతిపెద్ద స్కోర్. అనంతరం జింబాబ్వేను 147 పరుగులకే కట్టడి చేసి 107 పరుగుల తేడాతో గెలిచింది.
ఈ విజయం విండీస్‌కు నెట్ రన్‌రేట్ (NRR) పరంగా భారీ ఊపిరి ఇచ్చింది. ప్రస్తుతం వారు గ్రూప్-1లో 5.350 అనే అద్భుతమైన నెట్ రన్ రేట్‌తో అగ్రస్థానంలో ఉన్నారు. దక్షిణాఫ్రికా 3.800 నెట్ రన్‌రేట్‌తో రెండో స్థానంలో ఉండగా, భారత్ -3.800 నెట్ రన్‌రేట్‌తో మూడో స్థానంలో ఉంది. జింబాబ్వే -5.350 రన్‌రేట్‌తో చివరిస్థానంలో ఉంది.
ఈ పరిస్థితుల్లో భారత్ సెమీఫైనల్ ఆశలు తమ తదుపరి రెండు మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడి ఉన్నాయి. జింబాబ్వే, వెస్టిండీస్‌పై భారత్ గెలిచినా, మూడు జట్లు నాలుగు పాయింట్లతో సమానంగా ఉంటే నెట్ రన్‌రేట్ కీలకం అవుతుంది. ప్రస్తుతం ఉన్న తేడా దృష్ట్యా భారత్‌కు ఇది పెద్ద సవాల్.
అందువల్ల భారత్ తదుపరి మ్యాచ్‌లో భారీ విజయాన్ని సాధించి నెట్‌రన్‌రేట్ మెరుగుపరచుకోవాలి. లేకపోతే వెస్టిండీస్ తమ మిగతా మ్యాచ్‌ల్లో ఓడిపోతేనే భారత్‌కు మార్గం సులభమవుతుంది.
Also Read:బెంగాల్ ఓటర్లకు ప్రధాని భావోద్వేగ లేఖ

