స్వదేశంలో జరిగే వరల్డ్ కప్ కు ముందు ఎప్పుడు లేనంత ఫామ్ లో కనిపిస్తోంది. వరుస విజయాలతో ఇప్పటికే ఆసియా కప్ గెలుచుకున్న రోహిత్ సేన, ఇక ఆస్ట్రేలియాతో జరుగుతున్నా మూడు వన్డేల సిరీస్ ను కూడా ఇప్పటికే 2-0 తో మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. యువ ప్లేయర్స్, సీనియర్ ప్లేయర్స్ అంతా కూడా సమిష్టిగా రానిస్తూ బ్యాటింగ్ లోనూ భౌలింగ్ లోనూ టీమిండియాను అత్యంత పటిష్టంగా మార్చారు. దాంతో వరల్డ్ కప్ వేటలో టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఇదిలా ఉంచితే ఆసీస్ తో జరుగుతున్నా మూడు వన్డేల సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ ల్లో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంది. .
కీలక ఆటగాళ్ళైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హర్ధిక్ పాండ్య వంటి వారు లేకపోయినప్పటికి శుబ్ మన్ గిల్, కేఎల్ రాహుల్, ఇషన్ కిషన్, శ్రేయస్ అయ్యర్.. వంటి యువ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన కనబరిచి జట్టుకు విజయాలను అందించారు. ఇక రేపు జరగనున్న మూడో వన్డే లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హర్ధిక్ పాండ్య తిరిగి జట్టులోకి రానున్నారు. కాగా మొదటి రెండు మ్యాచ్ లలో అద్భుతమైన ఆటతీరు కనబరిచిన గిల్ కు మూడే వన్డేలో విశ్రాంతినిచ్చింది బీసీసీఐ. ఇక గాయం కారణంగా మొదటి రెండు మ్యాచ్ లకు దూరమైన అల్ రౌండర్ అక్షర్ పటేల్ మూడో మ్యాచ్ కూడా అందుబాటులో ఉండేలా కనిపించడం లేదు. దాంతో అతడి స్థానంలో అశ్విన్ నే మూడో వన్డే కు కూడా సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇక వరల్డ్ కప్ కు ముందు జట్టు కూర్పులో రేపు జరిగే మ్యాచ్ కీలకం కానుంది. మరి టీమిండియా ఇదే జోరును కొనసాగిస్తుందేమో చూడాలి.
Also Read:Next Pandemic Disease X:కొవిడ్ కంటే ప్రాణాంతకం..