చంద్రబాబు అంచనాలన్నీ తారుమారు?

36
- Advertisement -

ఏపీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని చూస్తున్న చంద్రబాబుకు మళ్ళీ నిరాశే ఎదురయ్యే అవకాశం ఉందా ? అంటే అవుననే చెబుతున్నాయి ఇప్పటివరకు వెలువడనిన సర్వేలు. మరో పది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇంకా ముందస్తు ఎన్నికలకు తెర లేచిన ఆశ్చర్యం లేదు. ఈ నేపథ్యంలో గెలుపోటములపై ప్రజానాడీ పట్టేందుకు ఆయా సంస్థల సర్వేలు తెరపైకి రావడం సర్వసాధారణం. ఆ విధంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిగే ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే దానిపై ఇప్పటికే చాలా సర్వేలు తెరపైకి వచ్చాయి. టైమ్స్ నౌ నవభారత్, ఇండియా సర్వే, ఇలా ఎన్నో ప్రముఖ సర్వేలు బహిర్గతం అయ్యాయి. .

ఇప్పటివరకు వచ్చిన ప్రతిసర్వే కూడా ఏపీలో వైసీపీనే మరోసారి అధికారంలోకి రాబోతుందని తేల్చి చెప్పాయి. ఇక తాజాగా వెలువడిన పోలిటికల్ క్రిటిక్ సంస్థ సర్వే రిపోర్ట్ కూడా వైసీపీకే పట్టం కట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో 49.5 శాతం ఓటు షేర్ తో వైసీపీ 135 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉందని తేల్చి చెప్పింది. ఇక టీడీపీకి 38.5 శాతం ఓటు షేర్ తో 35 అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందట. దీని బట్టి ఏపీలో మరోసారి అధికారం జగన్ దే అని పోలిటికల్ క్రిటిక్ సంస్థ కూడా తేల్చి చెప్పింది. ఇలా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది బయటకు వస్తున్న సర్వేలన్నీ జగన్ కే అనుకూలంగా వస్తుండడంతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైనట్లు టాక్ నడుస్తోంది.

Also Read:‘మట్కా’ కోసం హైదరాబాద్‌కు నోరా ఫతేహి!

ఆ మద్య జరిగిన పట్టభద్రుల ఎలక్షన్ లో టీడీపీ కొంత మెరుగ్గా కనిపించింది. దీంతో వైసీపీపై జగన్ పాలనపై ప్రజా వ్యతిరేకత మెదలైందని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. దీంతో ఈసారి ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయం అని భావిచ్చారు. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది చంద్రబాబు అంచనాలన్నీ తారుమారు అవుతున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మ చేయించిన సర్వేలో కూడా టీడీపీ కొంత వెనుకంజలోనే ఉన్నట్లు చంద్రబాబుకు రిపోర్ట్స్ అందయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈసారి ఎన్నికల్లో టీడీపీ గెలవడం అత్యంత కీలకమైన నేపథ్యంలో ప్రజలు టీడీపీ ఎలాంటి రిజల్ట్స్ ను ఇస్తారో చూడాలి.

Also Read:సమంత పై అభిమానులు సీరియస్

- Advertisement -