ఏ రాజకీయ పార్టీకైన ఎన్నికల మేనిఫెస్టో అంటే భగవద్గీత,బైబిల్,ఖురాన్‌తో సమానం. ఎందుకంటే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను, నాయకుడి పై నమ్మకాన్ని చూసి జనాలు ఓట్లేస్తారు. అలాంటి మేనిఫెస్టోలో ఒక హామీ ఇచ్చామంటే దానిని నెరవేర్చి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా నాయకుడి ఆలోచన విధానం ఉండాలి. కానీ ప్రస్తుతం దేశంలో అలాంటి పరిస్థితి లేదు. అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇస్తున్నారు నేతలు. తీరా ఎన్నికలై ఒకవేళ గెలిస్తే వాటి అమలులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది.
ఇప్పుడు సరిగ్గా ఏపీలో టీడీపీ మేనిఫెస్టో చూస్తే ఇదే అనుమానం అందరికి తలెత్తుతోంది. ఎందుకంటే చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇస్తున్న హామీలు వింటే ఎవ్వరైనా టెంప్ట్ అయిపోతారు. కానీ అవన్నీ ఎంత వరకు ఆయన నెరవేరుస్తారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న?
బీసీ మహిళలల్లో పెన్షన్ ఇవ్వాలంటే 32-33 లక్షల మందికి ఇవ్వాల్సి ఉంటుంది. వీరికి నెలకు రూ.4వేల చొప్పున ఇవ్వాలంటే నెలకు దాదాపు రూ.1,400 కోట్లు కావాలి. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు ఇవ్వాలంటే రాష్ట్రంలోని 20 లక్షలమందికీ ఇవ్వాలి. అంటే రూ.600 కోట్లు కావాలి. ఉద్యోగస్తుల జీతభత్యాలు, పెన్షన్లతో కలిపి నెలకు రూ.4,800 కోట్లు, వాలంటీర్లు 2 లక్షల 65 వేల మంది ఉన్నారు, ఒక్కొక్కరికీ రూ.10 వేలు అంటే రూ.265 కోట్లు కావాలి.
18 -50 ఏళ్ళ వరకు ఉన్న మహిళలకు రూ.1,500 చొప్పున ఇస్తామంటున్నారు వీళ్లు రాష్ట్రంలో 80 లక్షల మంది ఉన్నారు. ఇది దాదాపు రూ.1,200 కోట్ల వరకు అవుతుంది. అంటే మొత్తం దాదాపు రూ.13,200 కోట్లు ప్రతి నెలా ఒకటో తారీఖునే ఉదయానికల్లా రెడీగా ఉండాలి.
ఆరోగ్యశ్రీ, మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ పిల్లకు పెట్టె ఆహారం.. వసతిదీవెన, విద్యాదీవెన ప్రభుత్వ బడుల్లో నాడు-నేడు పనులు ఇవన్నీ కాకుండానే మామూలుగా పథకాలకు ప్రతి నెలా ఒకటో తారీఖు ప్రొద్దుటికే రూ.13,200 కోట్లు కావాలి.
పక్కరాష్ట్రాల నుంచి కాపీకొట్టి తెచ్చిన ఈ పథకాలను అమలు చేయాలంటే బడ్జట్ కూడా పక్కరాష్ట్రంతో సమానంగా ఉండాలి. ఇవన్నీ అమలు చేస్తే వెల్ అండ్ గుడ్. కానీ అమలయ్యే అవకాశాలు ఎక్కువగా లేదు. ఇవన్నీ సకాలంలో అమలు చేయకపోతే మొదటికే మోసం వస్తుంది. చంద్రబాబు హామీల విషయంలో ఇప్పుడు జనాల ఆలోచన ఎలా ఉంది? బీజేపీ ఆయన మేనిఫెస్టోకి మద్దతు పలికిందా? లేక పక్కన పెట్టిందా? ఇవన్నీ జనాల్లో ఉన్న ప్రశ్నలు.
జగన్ ప్రభుత్వం హామీలు ఇస్తే.. తీర్చకుండా ఎస్కేప్ అయిన సందర్భాలు లేవు.అప్పుడు రాజశేఖర్ రెడ్డి అయినా ఇప్పుడు ఆయన బిడ్డ జగన్ అయినా మాట ఇస్తే కట్టుబడి ఉంటారు. అందుకే చంద్రబాబు ఇచ్చే హామీల మీద కన్నా, జగన్ పైనే జనాలకి నమ్మకం ఉంది. మళ్ళీ మా నాయకుడివి నువ్వే జగన్ అన్నా అంటూ ప్రజలు సైతం ఆయనకి మద్దతు పలుకుతున్నారు.
Also read:Harishrao:రాష్ట్రంలో RR ట్యాక్స్..ఈడీ ఎక్కడా?