ఏపీ రాజకీయాల్లో ఓ వైపు ప్రచారం మాటల యుద్ధంతో హోరెత్తుతుండగా మరోవైపు పోటీ చేస్తున్న కొంతమంది అభ్యర్థులు, వారి బంధువులపై వరుస దాడులు కలకలం రేపుతున్నాయి. దళితురాలినైన హోంమంత్రి తానేటి వనితపై దాడులకు తెగబడ్డారు కొంతమంది. దీనిని ఆమె ఖండించారు. తనని కించపరుస్తూ.. రౌడీయిజం ప్రదర్శిస్తూ, దాడి చేసి గెలవాలనుకోవడం ఎంత వరకు కరెక్ట్? అని ప్రశ్నించారు.
ఇక ఈ దాడి ఘటన మర్చిపోక ముందే మాచర్ల నియోజకవర్గం వెల్దుర్ది మండలంలో ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమ్య పై దాడి జరిగింది. ఈ దాడిలో ఎమ్మెల్యే భార్యతో పాటు మహిళా కార్యకర్తలకు దాడులయ్యాయి. విజయవాడలోనూ వైసీపీ మహిళా కార్యకర్తలపై దాడులు జరిగాయి. అలాగే ఒంగోలు మంత్రి బాలినేని కోడలుపై దాడికి తెగబడ్డారు కొంతమంది.
అయితే ఈ దాడుల వెనుక ఉంది ప్రత్యర్థి పార్టీనేనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఓటమి భయంతోనే దాడులకు తెగ బడుతున్నారని మండిపడుతున్నారు. ఓ వైపు సంక్షేమాన్ని ఆపి మరోవైపు దాడులు చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
Also Read:‘ఆర్య’ నా జీవితాన్నే మార్చేసింది..