షుగర్ ఫాస్టింగ్ మంచిదేనా!

1
- Advertisement -

ఏవైనా పండగలు వచ్చినప్పుడు లేదా భక్తి పేరుతో హోమాలు, వ్రతాలు, పూజలు చేసేటప్పుడు చాలా మంది ఉపవాసం చేయడానికి మొగ్గు చూపుతూ ఉంటారు. ఇలా ఉదయం నుంచి రాత్రి వరకు ఎటువంటి ఆహారం తీసుకోకుండా నీరు ఏ మాత్రం సేవించకుండా రోజంతా అలాగే గడిపేస్తూ ఉంటారు. కొందరు ఉపవాసం పేరుతో రోజుల తరబడి ఆహారాన్ని తీసుకోరు. అయితే ఇలా తరచూ ఉపవాసం ఉండడం వల్ల మంచిదేనా ? ఏమైనా నష్టాలు ఉన్నాయా ? షుగర్ పేషంట్లు ఉపవాసం చేయవచ్చా? తెలుసుకుందాం.

మధుమేహం బాధితులు సక్రమంగానే తింటున్నా కూడా వాళ్లు తీసుకున్న ఆహారం మొత్తాన్ని శరీరం పూర్తిగా వినియోగించుకునే పరిస్థితి ఉండదని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో వీటి స్థాయులు పెరిగితే గుండె, ఊపిరితిత్తుల పని తీరు దెబ్బతిని క్రమేపీ అవి విఫలమైపోతుంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే మధుమేహులకు ఏదైనా సర్జరీ అవసరమై.. గంటలతరబడి ఆహారం ఇవ్వకూడని పరిస్థితి ఎదురైనా కూడా ఒకవైపు నుంచి గ్లూకోజు ఎక్కిస్తూ, మరోవైపు ఇన్సులిన్‌ ఇంజక్షన్లు ఇస్తారని వివరించారు.

అందుకోసమే షుగర్ వ్యాధిగ్రస్థులు ఉపవాసం చెయ్యకుండా ఉండటం అవసరమని సూచిస్తున్నారు. అయితే మధుమేహానికి ముందస్తు దశలో ఉన్న వారికి మాత్రం ఉపవాసం మంచే చేస్తోందని.. దీనివల్ల వారు త్వరగా మధుమేహం బారినపడకుండా ఉంటున్నారని అధ్యయనాల్లో తేలింది. కాబట్టి ఉపవాసం చెయ్యటం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.

రోజులో లేదా వారంలోనో అప్పుడప్పుడు.. ఒక క్రమం ప్రకారం కొన్ని గంటల పాటు ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండటాన్ని వైద్యపరిభాషలో ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ అంటారు. ఇలా చేయడం వల్ల శరీరంలో ఎన్నో మంచి మార్పులు జరుగుతున్నాయని.. అలాగే జబ్బులను తెచ్చిపెట్టే దుష్ప్రభావాలూ తగ్గుతున్నాయని పరిశోధకులు నిర్థరించారు.

Also Read:కీరదోసతో ప్రయోజనాలెన్నో..!

- Advertisement -