ఉఫ్.. కేజీఎఫ్ తీస్తా అన్నాడట

24
- Advertisement -

ఉట్టికి ఎగరలేను గానీ, ఆకాశానికి ఎగురుతా అన్నాడట ఒకడు. అలాగే ఉంది దర్శకుడు శ్రీవాస్ పరిస్థితి కూడా. ఇప్పటివరకూ శ్రీవాస్ సినీ కెరీర్ లో అదిరిపోయే సినిమా ఒక్కటి కూడా తీయలేదు. కానీ, ఆయన గారి మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్, డింపుల్ హయతి జంటగా నటించిన రామబాణం మే 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ శ్రీవాస్ బిల్డప్ డైలాగ్ లు చెప్పాడు. దీంతో నెటిజన్లు శ్రీవాస్ పై విరుచుకుపడుతున్నారు. ఇంతకీ శ్రీవాస్ ఏం మాట్లాడాడు అంటే..

‘గోపీచంద్‌ తో నేను కేజీఎఫ్ లాంటి ఓ భారీ యాక్షన్ సినిమా తీద్దామనుకున్నాను, అలాంటి ఓ కథను కూడా నేను గోపీచంద్ కి వినిపించాను. కానీ, గోపీచందే వద్దన్నారు. దీంతో ఆ కథను పక్కన పెట్టి, రామబాణం అనే ఈ ఫ్యామిలీ డ్రామాను తెరకెక్కించాను’ అని శ్రీవాస్ చెప్పుకొచ్చాడు. ఈ మాటలు విన్నాక రెండు చేతులు జేబులో పెట్టుకుని ఎటు పోవాలో తెలియడం లేదు అంటూ నెటిజన్లు ఫన్నీగా శ్రీవాస్ ను ట్రోల్ చేస్తున్నారు.

Also Read:Rajinikanth:వెనక్కి తగ్గేదిలేదు

నాయనా దర్శక రత్న శ్రీవాస్ గారు మీ డైరెక్షన్ టైం అయిపోయింది, ఇక మీకు దర్శకుడిగా పుట్టగతులు లేవు. కాబట్టి, ఇలా అతి బిల్డప్ తో మీరు మీ సమయాన్ని చక్కగా గడిపేయండి అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. మొత్తానికి శ్రీవాస్ వ్యవహారం ఇలా కామెడీ పాలు అయ్యింది.

Also Read:Nargis Dutt:జీవిత చరిత్ర

- Advertisement -