శ్రీకాంత్ అడ్డాల.. మళ్లీ ట్రాక్ ఎక్కేనా?

14
- Advertisement -

శ్రీకాంత్ అడ్డాల కొద్ది కాలంగా సక్సెస్ రుచి కోసం ఎదురుచూస్తున్నారు. బ్రహ్మోత్సవంతో భారీ డిజాస్టర్‌ను మూటగట్టుకున్నారు శ్రీకాంత్ అడ్డాల. అయితే ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్ మూవీల ట్రెండ్ నడుస్తోండగా ఇక శ్రీకాంత్ కెరీర్‌లో హిట్ కొట్టిన చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.

ఈ సినిమా రీ రిలీజ్ కాగా రీ రిలీజ్‌లోనూ సత్తాచాటుతోంది. దీంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. రీ-రిలీజ్ మంచి విజయాన్ని అందుకోవడంతో ఓ యంగ్ హీరో శ్రీకాంత్ అడ్డాల దగ్గర ఏదైనా మంచి కథ ఉంటే చెప్పాలని కోరాడట. ప్రస్తుతం ఈ టాపిక్ సినీ సర్కిల్స్‌లో జోరుగా చక్కర్లు కొడుతోంది.

గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో ఏదైనా కథ ఉంటే చెప్పాలంటూ ఆ యంగ్ హీరో శ్రీకాంత్ అడ్డాల ను కోరాడట. దీంతో రీ రిలీజ్ మూవీతో శ్రీకాంత్ అడ్డాల మంచి ఛాన్స్ కొట్టేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read:ఉన్మాదిలా మాట్లాడుతున్న రేవంత్: హరీష్‌ రావు

- Advertisement -