వైఎస్ఆర్ తెలంగాణ అధినేత్రి వైఎస్ షర్మిల గత కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్నారు. మొన్నటి వరకు నానా హడావిడి చేసిన షర్మిల ఇప్పుడు సైలెంట్ గా ఉండడానికి కారణం.. ఆమె దృష్టి కాంగ్రెస్ వైపు మల్లడమే. ఆమె కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేస్తారని గత కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అటు కాంగ్రెస్ లోని పలువురు నేతలు ఈ విషయాన్ని బహిరంగమగనే ప్రస్తావిస్తున్నారు కూడా. కానీ కాంగ్రెస్ లో చేరడంపై ఇంతవరకు ఆమె ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. అలాగని తన పార్టీ కార్యకలాపాలను కూడా నడపడం లేదు. దీంతో షర్మిల ఎటు తేల్చుకోలేని డైలమా స్థితిలోకి వెళ్ళిందా ? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. .
మరోవైపు తెలంగాణ ఎన్నికలకు ఎంతో సమయం లేదు. ఇప్పటికే అధికార బిఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై తలమునకలయ్యాయి. కానీ షర్మిల మాత్రం తన పార్టీ పరంగా ఏమంత యాక్టివ్ గా కనిపించడం లేదు. దీన్ని బట్టి చూస్తే ఆమె కాంగ్రెస్ వైపు అడుగులు వేసేందుకు సిద్దంగా ఉందని స్పష్టమౌతోంది. కానీ టీ కాంగ్రెస్ లో షర్మిల అవసరత లేదని రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. అంతే కాకుండా ఆమె కాంగ్రెస్ లో చేరి ఏపీకి ప్రాతినిథ్యం వహిస్తే నో ప్రాబ్లం అని కూడా చెప్పుకొచ్చారు. ఇక్కడే షర్మిల ఎంట్రీకి అడ్డుకట్ట పడినట్లైంది. తాను తెలంగాణ బిడ్డనని, తెలంగాణలోనే తన రాజకీయ జీవితం కొనసాగుతుందని ఆమె గతంలోనే కుండబద్దలు కొట్టారు. దీంతో ఆమె ఏపీకి వెళ్ళే పరిస్థితులు లేవనే చెప్పాలి. ఒకవేళ ఏపీ కాంగ్రెస్ లోకి వెళ్లాల్సి వస్తే తన అన్నీ వైఎస్ జగన్ ను ప్రత్యర్థిగా బరిలో నిలవాల్సి ఉంటుంది. అందుకే ప్రస్తుతం షర్మిల ఎటు తేల్చుకోలేక మౌనం వహిస్తోందని టాక్. మరి ముందు రోజుల్లో షర్మిల మౌనం వీడి ఎటు వైపు అడుగులు వేస్తుందో చూడాలి.
Also Read:ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు చెప్పిన తమన్నా