సమంత మళ్లీ పెళ్లి..అయినా కష్టమేనట

41
- Advertisement -

నాగచైతన్యతో విడాకుల తర్వాత ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్న సమంత త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ ఓ వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. దీనికి తోడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్న ఈ సమయంలో సమంత సడెన్ గా ఏడాది పాటు సినిమాలకు బ్రేక్‌ తీసుకోబోతున్న విషయం తెలిసిందే. పైగా ఈ మధ్య ఈ అమ్మడు తన సోషల్‌ మీడియా ఖాతాలో ప్రేమకు సంబంధించిన పోస్ట్‌ లు ఎక్కువగా చేస్తోంది. మొన్న కూడా ఈ ప్రపంచంలో మనల్ని ద్వేషించి మనుషులు చాలా మంది ఉంటారని.. అలాగే ప్రేమించే వ్యక్తి కూడా ఉంటారంటూ ఓ పోస్ట్ పెట్టింది.

ఇలాంటి పోస్ట్‌ లను బట్టి సమంత మళ్లీ ప్రేమలో పడిందా అంటూ అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుందని అంటున్నారు. అయితే, ఈ తరుణంలో ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి, సమంత రెండో పెళ్లిపై స్పందించాడు. సమంత జాతకరీత్యా ఆమె రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ, అది కూడా ఎంతో కాలం నిలవదని వేణు స్వామి జోస్యం చెప్పారు. పైగా సమంత మరిన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తుందంటూ వేణు స్వామి వ్యాఖ్యానించాడు.

Also Read:ముగ్గురు హీరోయిన్లను వేధించారట

ఇక సినిమాల విషయానికి వస్తే..సమంతకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టంట వైరల్ అవుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత తన మయోసైటిస్ వ్యాధి ట్రీట్మెంట్ కోసం ఓ స్టార్ హీరో దగ్గర రూ. 25 కోట్లు అప్పు చేసిందంటు వార్తలు వస్తున్నాయి. తన జాన్ జిగిడి రిచ్ దోస్తైన హీరో దగ్గర అప్పుగా తీసుకుందని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయం ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.

Also Read:గసగసాలు ఎక్కువగా వాడుతున్నారా?

- Advertisement -