సలార్ ఎఫెక్ట్ సంక్రాంతి సినిమాలపై ఉంటుందా?

40
- Advertisement -

నేషనల్ స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న అప్ కమింగ్ క్రేజీ మూవీ ‘ సలార్ ‘. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న విడుదల కానుంది. ఎన్నో రోజుల నుంచి పోస్ట్ పోన్ అవుతున్న ఈ మూవీ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హీరో ప్రభాస్ అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇద్దరికీ కూడా పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ ఉండడంతో సలార్ పై భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్ వంద మిలియన్ల వ్యూస్ ను రాబట్టి సినిమా పై ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో చెప్పకనే చెప్పింది. ఇక డిసెంబర్ 1 న మూవీ నుంచి ట్రైలర్ విడుదల కానుంది. ఆ ట్రైలర్ తో మూవీపై హైప్ మరింత పెరిగిపోవడం ఖాయం. సలార్ కు పోటీగా షారుక్ ఖాన్ డంకి మూవీ వస్తున్నప్పటికి ఆ మూవీపై పెద్దగా బజ్ లేకపోవడంతో ఈ క్రిస్మస్ సీజన్ లో ప్రభాస్ కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి..

కాగా సలార్ మూవీకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన.. ఆ మూవీ ఎఫెక్ట్ సంక్రాంతి సినిమాలపై కూడా పడే అవకాశముంది. ఈ సంక్రాంతి సీజన్ లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దాదాపు అరడజన్ సినిమాలు పోటీ పడుతున్నాయి. మహేష్ బాబు ‘గుంటూరుకారం’, వెంకటేష్ ‘సైందవ్’, నాగార్జున ‘ నా సామిరంగా ‘, హనుమాన్, ఫ్యామిలీ స్టార్, వంటి స్ట్రైట్ తెలుగు సినిమాలతో పాటు మరో రెండు డబ్బింగ్ సినిమాలు కూడా పోటీ పడుతున్నాయి. అయితే సలార్ మూవీ కి హిట్ టాక్ పడితే ప్రభాస్ మేనియా కనీసం నెల రోజులు ఉండే అవకాశం ఉంది. అలా చూస్తే సలార్ కారణంగా సంక్రాంతి సినిమాలపై ఎఫెక్ట్ పడుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే సలార్ టాక్ ను బట్టి కొన్ని సినిమాలు వాయిదా వేసుకున్నా ఆశ్చర్యం లేదనేది ట్రేడ్ వర్గాలు చెబుతున్న మాట. మరి సలారోడు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

Also Read:దీక్షా దివస్…చరిత్రను మలుపు తిప్పినరోజు

- Advertisement -