జయ నెచ్చెలిగా సాయిపల్లవి..!

205
sai pallavi
- Advertisement -

దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ని ముగ్గురు దర్శకులు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అందులో మొదటగా సినిమాను స్టార్ట్ చేసిఫస్ట్‌లుక్‌తో ప్రేక్షకుల ముందుకువచ్చిన దర్శకురాలు ప్రియదర్శని. ఈసినిమాకు ది ఐరన్ లేడీ అనే టైటిల్‌ని ఖరారు చేసిన ప్రియదర్శిని పాత్రల ఎంపికలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తునే సినిమా షూటింగ్‌ని శరవేగంగా కంప్లీట్ చేస్తోంది.

ప్రముఖ తమిళ దర్శకుడు ఏ.ఎల్‌ విజయ్‌ జయలలితపై మరో బయోపిక్‌ తీస్తుండగా ఇందులో జయ పాత్రలో బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌ను ఎంపిక చేసుకున్నట్లు కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి.

ఇక జయలలిత రాజకీయ జీవితంలో కీలకపాత్ర పోషించిన స్నేహితురాలైన శశికళ పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. దీని గురించి చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం సాయి పల్లవి వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. తెలుగులో ఆమె నటించిన ‘పడి పడి లేచె మనసు’, తమిళంలో నటించిన ‘మారి’ చిత్రాలు గత శుక్రవారం విడుదలై మంచి టాక్‌ అందుకున్నాయి.

ఏఎల్‌ విజయ్‌ …లైకా నిర్మాణ సంస్థతో భారీ బడ్జెట్‌లో జయ బయోపిక్‌ని తెరకెక్కిస్తోంది. ఇటీవల స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకున్న
విజయ్‌…త్వరలో పట్టాలెక్కించనున్నారు. ఈ సినిమాకు ‘అమ్మా ఎండ్రాల్‌ అన్బు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. 2020 ఫిబ్రవరి 24న సినిమాను విడుదల చేయనున్నట్లు టాక్‌.

- Advertisement -