Puhspa 2:పుష్ప 2..వాయిదానేనా?

4
- Advertisement -

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2. 2021 బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది పుష్ప. అల్లు అర్జున్ కెరీర్ లోనే అతిపెద్ద విజయంగా నిలవడంతోపాటు.. తనకు జాతీయస్థాయి అవార్డు తెచ్చి పెట్టిన చిత్రంగా పుష్ప నిలిచింది. దీంతో దీనికి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న పుష్ప-2 ద రూల్ చిత్రం పై భారీ అంచనాలు పెరిగాయి.

2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్టు ప్రకటించిన సంగ‌తి తెలిసిందే.అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. ఇంకా 50 రోజుల షూటింగ్ మిగిలి ఉందని టాలీవుడ్ సమాచారం

చెప్పిన టైంకు సినిమాను తీసుకురావడానికి సుకుమార్ చాలా కష్టపడుతున్నారట. అందుకే టీమ్ మూడు యూనిట్లుగా సినిమా షూట్ చేస్తున్నారట. రెండు యూనిట్లు రామోజీ ఫిలిం సిటీలో, ఒక యూనిట్ మారేడుమిల్లిలో షూటింగ్ చేస్తున్నారని తెలుస్తోంది.

Also Read:Kalki:అతిథిగా సీఎం, డిప్యూటీ సీఎం!

- Advertisement -