పొంగులేటితో కాంగ్రెస్ కు ముప్పే?

31
- Advertisement -

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కాంగ్రెస్ కు ఇబ్బందులు తప్పవా ? ఆయన తెలంగాణ రాజకీయాల్లో మరో ఏక్ నాథ్ షిండే కాబోతున్నారా ? అంటే అవుననే సమాధానాలు అరకొర వినిపిస్తున్నాయి. తాజాగా మాజీ మావోయిస్ట్ గాదె ఇన్నయ్య ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీతో టచ్ లో ఉన్నారని, ఆయన మరో ఏక్ నాథ్ షిండేలా మారే అవకాశం ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. బి‌ఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చిన తరువాత పొంగులేటి బీజేపీలో చేరతారని గట్టిగా వార్తలు వినిపించాయి. ఆ పార్టీ అగ్రనేతలతో కూడా మంతనాలు జరిపారు. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్ళి హస్తం కండువా కప్పుకున్నారు. .

ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచి మంత్రి పదవి చేపట్టారు. ఇకపోతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రేవంత్ రెడ్డి సర్కార్ ఎక్కువ రోజులు పాలన సాగించడం కష్టమని, త్వరలో ఆ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందని తరచూ ఇతర పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరత తమకు లేదని బి‌ఆర్‌ఎస్ అధిష్టానం ఇప్పటికే చాలాసార్లు చెప్పుకొచ్చింది. ఇక మిగిలింది బీజేపీనే. మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వాన్ని కూల్చి ఏక్ నాథ్ షిండే అధికారం చేపట్టడంలో బీజేపీదే అధిక పాత్ర.

అదే విధంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ ను కుల్చేందుకు ఏక్ నాథ్ షిండే వ్యూహం అమలు చేసేందుకు బీజేపీ సిద్దమైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏక్ నాథ్ షిండే పాత్ర కోసం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కమలం పార్టీ ఉపయోగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయట. అయితే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్న ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో లేదో తెలియదు గాని.. ప్రస్తుతం మాజీ మావోయిస్ట్ నేత గాదె ఇన్నయ్య చేసిన వ్యాఖ్యలు పోలిటికల్ హీట్ పెంచుతున్నాయి. మరి నిజంగానే కాంగ్రెస్ ను కుల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందా ? అనేది తెలియాలంటే లోక్ సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత అసలు విషయం తెలుస్తుందనేది కొందరి అభిప్రాయం.

Also Read:సుప్రీంకు క్షమాపణ చెప్పిన పతంజలి..

- Advertisement -