పెద్ది మరోసారి వాయిదా పడ్డట్లేనా?

5
- Advertisement -

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పెద్ది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తొలుత మార్చి 27న రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. అయితే ఆ తర్వాత రిలీజ్ డేట్‌ను ఏప్రిల్ 30కు వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ మరోసారి పోస్ట్ పోన్ అవుతుందని ప్రచారం జరుగుతోంది.

త్వరలో విడుదల కానున్న రెండో సింగిల్ “రై రై రారా”తో రిలీజ్ డేట్‌ను అఫిషియల్‌గా కన్ఫామ్ చేస్తారనే టాక్ నడుస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్‌లతో పాటు శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ, జగపతి బాబు, సత్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వృద్ధి సినిమాస్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read:Modi:ప్రధాని మోదీ అరుదైన ఘనత..

- Advertisement -