2024 ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడానికి ఎంతో సమయం లేదు. ఈ నెల 22 నుంచి ఐపీఎల్ తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. సీజన్ ప్రారంభం కావడానికి ముందు క్రికెట్ అభిమానుల్లో కొన్ని సందేహాలు మెదులుతున్నాయి. గత కొన్నాళ్లుగా గాయాల కారణంగా టీమిండియాకు దూరమైన ఆటగాళ్లు కనీసం ఐపీఎల్ లోనైనా ఎంట్రీ ఇస్తారా లేదా ? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, హర్డిక్ పాండ్య, షమి.. ఇలా పలువురు ఆటగాళ్లు జట్టుకు దూరమై చాలా రోజులవుతుంది. రిషబ్ పంత్ రోడ్ యాక్సిడెంట్ తర్వాత కంప్లీట్ గా టీమిండియాకు దూరమయ్యాడు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ కూడా ఆడలేదు. ఇక ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పంత్.. ఐపీఎల్ ప్రారంభం నాటికి పూర్తి స్థాయిలో ఫిట్ నెస్ సాధించే అవకాశం ఉంది. .
డిల్లీ క్యాపిటల్స్ కు కెప్టెన్ గా రిషబ్ పంత్ వ్యవహరించనున్నాడు. ఇక వరల్డ్ కప్ సమయంలో గాయపడ్డ హర్డిక్ పాండ్య కూడా ఆ తరువాత జరిగిన ఏ మ్యాచ్ ఆడలేదు. గత కొన్నాళ్లుగా రెస్ట్ తీసుకుంటున్న పాండ్యా ఐపీఎల్ లో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో కేఎల్ రాహుల్ గాయపడి సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకున్న రాహుల్ ఐదో టెస్టుతో జట్టులోకి వస్తాడని భావించినప్పటికి అలా జరగలేదు. దాంతో అతడి రీఎంట్రీ కూడా ఐపీఎల్ లోనే ఉండే అవకాశం ఉంది. ఇలా కీలక ఆటగాళ్ళందరూ టీమిండియాకు దూరమైనప్పటికి ఐపీఎల్ తో తిరిగి గ్రౌండ్ లోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి చాలా రోజుల తర్వాత గ్రౌండ్ లోకి అడుగు పెడుతున్న ఈ ప్లేయర్స్.. ఎలాంటి ప్రదర్శనతో ఆకట్టుకుంటారో చూడాలి. ఇక ఈ సీజన్ ఐపీఎల్ తొలి మ్యాచ్ ఈ నెల 22న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనున్న సంగతి తెలిసిందే.
Also Read:రామ్ అబ్బరాజుతో #Sharwa37