వన్స్‌మోర్‌ అంటున్న కాంబో..

224
- Advertisement -

ఇప్పుడు వరుస సక్సెస్ లతో దూసుకుపోతోన్న దర్శకులలో కొరటాల శివ ఒకరు. ‘శ్రీమంతుడు’తో హిట్ కొట్టిన కొరటాల.. మరోసారి మహేశ్ తోనే రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఈ ఇద్దరూ సెట్స్ పైకి కూడా వెళ్లనున్నారు.

ఇదిలాఉంటే..ఈ సినిమా తరువాత యంగ్‌టైగర్ ఎన్టీఆర్ తో మరోసారి హ్యాట్రిక్ డైరెక్టర్ కొరటాల శివ జతకట్టబోతున్నాడట. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన జనతాగ్యారేజ్.. ఎన్టీఆర్‌ను వంద కోట్ల క్లబ్‌లో నిలిపింది. ఇప్పుడు  వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతోందని ఫిల్మ్‌నగర్ టాక్‌.
 Is Ntr Koratala Combination Repeat Again!
మహేశ్‌తో ‘భరత్ అనే నేను’ సినిమా కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న కొరటాల.. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా తీసేందుకు సిద్ధమైనట్టు చెబుతున్నారు. జనతా గ్యారేజ్ సినిమా ప్రమోషన్ల టైంలో తారక్ అంటే తనకు అభిమానమని, అతడి కోసం కథ రాస్తున్నానంటే తన పెన్నుమరింత జాగ్రత్తగా రాస్తుందని కొరటాల చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే తారక్ కోసం ఓ మంచి కథను కొరటాల సిద్ధం చేసుకున్నాడని, ఆ లైన్‌ను ఎన్టీఆర్‌కు వినిపించాడని అంటున్నారు.
Is Ntr Koratala Combination Repeat Again!
ఇక ఆ సినిమా లైన్ ఎన్టీఆర్‌కు కూడా నచ్చడంతో యంగ్‌ టైగర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసినట్లు సమాచారం.  ప్రస్తుతం బాబి డైరెక్షన్‌లో జైలవకుశ సినిమా చేస్తున్నఎన్టీఆర్‌…ఆ తర్వాత త్రివిక్రమ్‌కు డేట్స్ ఇచ్చేశాడు. ఆ తర్వాత రాజమౌళితో సినిమా తీసేందుకు ట్రై చేసినా.. వేరే హీరోతో రాజమౌళి కమిట్ అయ్యాననడంతో కొరటాలకు ఓకే చెప్పాడట ఈ యంగ్‌ టైగర్‌. ఇక త్రివిక్రమ్ సినిమా అంటే.. జైలవకుశ తర్వాత మరో ఆరు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో 2018లోనే కొరటాల శివ-తారక్‌ల సినిమా ఉంటుందని ఫిల్మ్‌నగర్ టాక్‌.

- Advertisement -