నయనతార విడాకులు నిజమేనా?

21
- Advertisement -

లేడీ సూపర్ స్టార్ నయనతార, తన భర్త విఘ్నేష్ శివన్‌ను ఇటీవల ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసింది. దీంతో, వాళ్లిద్దరు విడాకులు తీసుకోనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. నయన్ మళ్లీ విఘ్నేష్ ను ఫాలో చేయడంతో ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. తాజాగా, నయన్ ‘నేను పోగొట్టుకున్నాను’’ అని మళ్లీ ఇన్‌‌స్టాలో పోస్టు పెట్టింది. దీంతో, అసలు నయన్ – విఘ్నేష్ మధ్య ఏం జరుగుతుంది ?, నయనతార పెట్టిన పోస్ట్ ను బట్టి వాళ్లిద్దరి మధ్య మళ్లీ అభిప్రాయ భేదాలు వచ్చాయా ? అని అనుమానాలు కలుగుతున్నాయి.

మరో వైపు నయనతార అభిమానులు ఈ పోస్ట్ తో అయోమయంలో ఉన్నారు. ఇటు న‌య‌న‌తార, తన భర్త విఘ్నేష్ శివన్‌ విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. రీసెంట్ గా కూడా న‌య‌న‌తార త‌న ఇన్‌స్టాలో విఘ్నేష్ శివన్‌ని మొదట అన్ ఫాలో చేసింది. ఆ తర్వాతే వారిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు పుట్టుకొచ్చాయి. వెంటనే, ఈ రూమర్స్‌ కి నయనతార చెక్ పెట్టింది. తిరిగి ఆమె విఘ్నేష్ ను ఫాలో చేసింది.

కానీ, మళ్లీ ‘నేను పోగొట్టుకున్నాను’’ ఒక పోస్ట్ పెట్టింది. మొత్తానికి స్టార్ హీరోయిన్ నయనతారకి దర్శకుడు విఘ్నేష్ శివన్ కి మధ్య ఏదో తేడా కొట్టింది అనేది మాత్రం స్పష్టం అవుతుంది. మరి విడిపోతున్న నేపథ్యంలోనే ఆమె ఇలా రియాక్ట్ అయ్యిందా ?, లేక ఈ పోస్ట్ వెనుక మరో కారణం ఉందా ? అనేది తెలియాలి అంటే ‘నయనతార ఏం పోగొట్టుకుందో ఆమె చెప్పాలి.

Also Read:ఏపీలో రేవంత్ రెడ్డి .. వేడి పుట్టిస్తారా?

- Advertisement -