మాంస ప్రియులకు ఎంతో ఇష్టమైన ఆహారం మటన్. కొంతమంది వారానికి ఒకసారి తింటే మరికొంతమంది వారానికి కనీసం మూడుసార్లు అయినా తింటారు. ఇంకొంతమందికైతే ప్రతిరోజు నాన్ వెజ్ ఉండాల్సిందే. అయితే మటన్ ఎక్కువగా తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉండటమే కాదు గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువ. అంతేగాదు డయాబెటిస్ ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు.
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన ఓ పరిశోధనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మటన్ తినే అలవాటున్న వారిని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పది సంవత్సరాల పాటు పరిశీలించగా… టైప్-2 డయాబెటిస్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉందని తేలిందట. మటన్‌లోని హానికారక శాచురేటెడ్ కొవ్వులు సహజ ఇన్సులిన్ విడుదలను అడ్డుకుంటున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారట.
ముఖ్యంగా క్యాన్సర్ సంబంధిత వ్యాధులు, శ్వాస కొస సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదం పొంచి ఉంది. తరచూ మటన్ తినే వారిలో ఊబకాయం, మలబద్ధకం వంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే మటన్‌కు బదులుగా మంచి కొవ్వులూ, ప్రొటీన్ కోసం చేపలు తినడం మేలని సూచిస్తున్నారు.
Also Read:ఏ ఆహారం ఎంతెంత తీసుకోవాలో తెలుసా?