Mutton: మటన్ తింటున్నారా..అయితే?

62
- Advertisement -

మాంసప్రియులకు మటన్ ఎంతో ఇష్టమైన ఆహారంగా చెబుతుంటారు. మటన్ బలవర్థకమైన ఆహారం కావడంతో వారంలో కనీసం మూడుసార్లు అయిన మటన్ ఇష్టంగా తింటూ ఉంటారు. మరికొందరికి ప్రతిరోజూ కూడా మటన్ తినే అలవాటు ఉంటుంది. అయితే మటన్ ఎక్కువగా తింటే తిప్పలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే మాంసంలో సహజంగానే కొవ్వు శాతం అధికంగా ఉంటుంది. అందువల్ల ఎక్కువగా మటన్ తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే ఉంది. తద్వారా గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువ. ఇంకా మటన్ ఎక్కువగా తింటే ఇన్ ఫ్లామేషన్ పెరుగుతుంది. తద్వారా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు అధికం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా క్యాన్సర్ సంబంధిత వ్యాధులు, శ్వాస కొస సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదం పొంచి ఉంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర శాతం కూడా పెరిగి టైప్ 2 డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉంది. ఇవే కాకుండా తరచూ మటన్ తినే వారిలో ఊబకాయం, మలబద్ధకం వంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా మటన్ కారణంగా చెడు కొలెస్ట్రాల్ పెరిగి రక్తనాళాల్లో రక్త ప్రసరణ కు ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది. అందువల్ల పక్షపాతం, గుండె పోటు త్వరగా ఎటాక్ అవుతాయి. ముఖ్యంగా బిగ్ తినే వారికి ఈ సమస్యలు త్వరగా ఏర్పడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మటన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వారానికి ఒకటి లేదా రెండుసార్లకు మించి మటన్ తినరాదని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read:ప్రభుత్వ సలహాదారుడిగా కేకే..బాధ్యతల స్వీకరణ

- Advertisement -