Modi:బీజేపీని మోడీ బతికిస్తారా?

47
- Advertisement -

తెలంగాణలో బీజేపీ పనైపోయిందనే విషయం ఆ పార్టీ నేతలకు కూడా అర్థమైనట్లుంది.. అందుకేనేమో రాష్ట్ర నేతలందరూ సైలెంట్ గా ఉన్నారు. ” అనే అభిప్రాయం ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో చాలామంది వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం ప్రస్తుతం ఎన్నికల ముందు బీజేపీలో జాతీయ నేతల హడావిడి తప్పా రాష్ట్ర నేతలెవరూ కనిపించడం లేదు. గత కొన్నాళ్లుగా బీజేపీ రోజు రోజుకు మరింత పతనమవుతున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలు కుమ్ములాటలు కమలం పార్టీని గట్టిగానే దెబ్బ తీశాయి. పైగా బీజేపీతో కాంగ్రెస్ కు అంతర్గత ఒప్పందాలు ఉన్నాయనే వాదనలు కూడా బలపడుతూ రావడంతో ప్రజలు కూడా బీజేపీ ని లైట్ తీసుకున్నారు. అందుకే కమలం పార్టీలో కీలక నేతలుగా ఉన్న బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ వంటి వారు ఆశించినంతగా ప్రచారాలు కూడా నిర్వహించడం లేదు.

దానికి తోడు పార్టీలోని కీలక నేతలలలో చాలా మందికి ఒకరిపై ఒకరికి కోల్డ్ వార్ నడుస్తుండడం కూడా కమలం పువ్వు వాడిపోయేలా చేస్తోంది. దాంతో ప్రస్తుతం ఎన్నికల ముందు పార్టీని బ్రతికించుకునే భారం బీజేపీ అగ్రనేతలపై పడినట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా, నడ్డా.. వంటి జాతీయ నేతలు తెలంగాణలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ప్రజల్లో పార్టీకి మద్దతు లభించడం లేదు. స్వయంగా ప్రధాని మోడీ నిర్వహిస్తున్న బహిరంగ సభలకు కూడా ప్రజలు ముఖం చాటేస్తున్నారంటే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం వివిధ సర్వేలు చెబుతున్న దాని ప్రకారం కమలం పార్టీకి చాలా నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా రావడం కష్టమే అనే విషయం స్పష్టమవుతోంది. మరి ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కమలం పార్టీని ప్రధాని మోడీ ప్రచారాలు ఎంతవరకు పనికొస్తాయో చూడాలి.

Also Read:CM KCR:సంగారెడ్డికి మెట్రో తీసుకొస్తాం

- Advertisement -