మాస్ జాతర..వాయిదా!

15
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో తన కొత్త చిత్రం #RT76(మాస్ జాతర)తో మరోసారి తన సిగ్నేచర్ ఎనర్జీతో అలరించబోతున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకునే హై ప్రొడక్షన్ వాల్యూస్ తో చిత్రాలను అందించే SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న #RT76 హ్యుమర్, ఎమోషన్స్ తో కూడిన హోల్సమ్ ఎంటర్ టైనర్ గా వుండబోతోంది.

దర్శకుడు కిషోర్ తిరుమల, రవితేజ ట్రేడ్‌మార్క్ కామిక్ టైమింగ్, మాస్ అప్పీల్‌తో కూడిన ఫుల్ లెంత్ ఫ్యామిలీ డ్రామాని రాశారు. రవితేజ ఈ సినిమా కోసం చాలా స్టైలిష్ గా మేకోవర్ అయ్యారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ సినిమా ఆగస్టు 27 న రిలీజ్ కు రెడీ అవుతోంది. సినిమా రిలీజ్ కు పది రోజులు కూడా లేదు.. అయితే ఇప్పటివరకు సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలుపెట్టలేదు. దీంతో మాస్ జాతర వాయిదా పడుతోందని టాక్ నడుస్తోంది. ఆగస్టు పోతే.. సెప్టెంబర్ మొత్తం పెద్ద పెద్ద సినిమాలతో ప్యాక్ అయ్యి ఉంది. అక్టోబర్ లో కాంతార, ఇడ్లీ కడై ఉన్నాయి. మరి వీటి మధ్యలో మాస్ జాతర ఎప్పుడు వస్తుందో చూడాలి.

Also Read:బర్త్ డే గిఫ్ట్‌గా యూరియా బ్యాగ్!

- Advertisement -