పవన్ రికార్డ్ ను మహేష్ బీట్ చేస్తాడా ?

11
- Advertisement -

ప్రెజెంట్ టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ గట్టిగా నడుస్తుంది. నెలకి ఎవరో ఒక స్టార్ హీరో సినిమా రీ రిలీజ్ రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తాజాగా పవన్ కళ్యాణ్ ఖుషి న్యూ ఇయర్ స్పెషల్ గా ఆడియన్స్ ముందుకొచ్చింది. ఒకప్పటి క్లాసిక్ సినిమా కావడంతో పవన్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ అంతా ఈ సినిమాను గట్టిగా చూసి రికార్డ్ కలెక్షన్స్ అందించారు. మొదటి రోజు ఈ సినిమా మూడున్నర కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఐదు కోట్ల గ్రాస్ దాటేసింది.

అయితే ఈ నెల ఇరవై ఏళ్లు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మహేష్ బాబు ఒక్కడు మళ్ళీ రీ రిలీజ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ ఒక్కడు ఒక రోజు షోలు పడ్డాయి. కానీ పోకిరి రీ రిలీజ్ కారణంగా ఒక్కడు షోస్ భారీ రెస్పాన్స్ దక్కలేదు. ఇప్పుడు వారం పాటు ఒక్కడు థియేటర్స్ లో ఉండబోతుంది. మరి పవన్ రీ రిలీజ్ రికార్డ్ ను ఇప్పుడు మహేష్ ఒక్కడు తో బీట్ చేస్తాడా ? అని అందరూ వైట్ చేస్తున్నారు. ఖుషి క్లాసిక్ లవ్ స్టోరీ , ఒక్కడు కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన లవ్ స్టోరీ. పైగా గుణ శేఖర్ టేకింగ్ , మేకింగ్ ఎక్స్ట్రా ఆర్డినరీ గా ఉంటాయి. పైగా మణిశర్మ పాటలు కూడా ప్లస్.

మరి ఇవన్నీ కలిసి ఒక్కడు మహేష్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ ను కూడా థియేటర్స్ లోకి రప్పించే అవకాశం ఉంది. చూడాలి ఖుషి మొదటి రోజు రికార్డ్ ను ఒక్కడు క్రాస్ చేస్తుందా ? లేదా ?

ఇవి కూడా చదవండి..

- Advertisement -