ఆ డైరెక్టర్ పరిస్థితి ఇక కష్టమే

29
- Advertisement -

ఒక్క ఫ్లాప్ అగాధంలోకి నెట్టేయగలదు. పదుల సంఖ్యలో హిట్ ఇచ్చిన దర్శకులు కూడా ఓ అట్టర్ ప్లాప్ మూవీతో కృంగిపోయిన ఘటనలు ఉన్నాయి. వివి వినాయక్, దర్శకుడు శ్రీనువైట్ల, అలాగే లైగర్ తో పూరి ల పరిస్థితి ఏమిటో ప్రస్తుతం చూస్తున్నాం. అలాంటిది కెరీర్ నుంచి వరుస ప్లాప్ లు పడితే ఇంక ఏమైనా ఉంటుందా! దర్శకుడు మెహర్ రమేష్ ఇలాంటి గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. భోళా శంకర్ దెబ్బకు మెహర్ రమేష్ కెరీర్ ఆల్ మోస్ట్ క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చేసింది.

వంద కోట్ల వసూళ్లు సాధించి గల కెపాసిటీ ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ ని సైతం మెహర్ రమేష్ కరెక్ట్ గా వాడుకోలేకపోయాడు. నిజానికీ, భోళా శంకర్ చిత్రాన్ని భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. ఈ మూవీపై హైప్ ఎంతగా పెరిగిందంటే… రజనీకాంత్ జైలర్ ని కూడా మించిపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన భోళా శంకర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో కలెక్షన్స్ భారీగా తగ్గిపోయాయి. ఇప్పుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో నటించడానికి ఏ మీడియం రేంజ్ హీరో కూడా ముందుకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. నిర్మాతలు సైతం మెహర్ రమేష్ ను దూరం పెట్టేశారు.

Also Read:నిఖిల్..’స్వయంభు’ అప్‌డేట్

నిజానికి భోళా శంకర్ హిట్ అయ్యి ఉంటే.. తన హిందీ సినిమాని తెలుగు రీమేక్ బాధ్యతలను పవన్ కళ్యాణ్, మెహర్ రమేష్ కి అప్పగించారు. దీంతో పవన్ తో సినిమా ఛాన్స్ మెహర్ రమేష్ ఆల్ మోస్ట్ తనదే అనుకున్నాడు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యాక పవన్ ని కలిసి ఫైనల్ చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఇప్పుడు మెహర్ రమేష్ కి పవన్ ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదు. మొత్తమ్మీద పదేళ్ల తర్వాత ఛాన్స్ వచ్చి.. చివరకు మ్యాటర్ మొదటికి వచ్చేసింది.

Also Read:నోటి దుర్వాసనా..అయితే జాగ్రత్త!

- Advertisement -