మంగళగిరిలో వైసీపీ గెలుపుపై ధీమాగా ఉందా ? లోకేష్ కు మరోమారు ఓటమి తప్పదా ? అంటే అవుననే సమాధానాలు వైసీపీ వర్గం నుంచి వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో తొలిసారిగా అసెంబ్లీ బరిలో నిలిచారు లోకేష్. కానీ ఆ ఎన్నికల్లో ఆళ్ళ రామకృష్ణ రెడ్డి చేతిలో ఓటమిపాలు అయ్యారు. అప్పటి నుంచి మంగళగిరిలో పట్టు సాధించేందుకు లోకేష్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. తరచూ నియోజక వర్గంలో పర్యటిస్తూ అక్కడి ప్రజలకు అందుబాటులో ఉంటూ వస్తున్నారు. ఇక ఈసారి కూడా మంగళగిరి నుంచే పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈసారి ఈసారి ఎలాగైనా మంగళగిరిలో గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు లోకేష్. ఈ నేపథ్యంలో లోకేష్ కు చెక్ పెట్టేందుకు వైసీపీ అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. స్థానికంగా ప్రజా బలం ఉన్న మురుగుడు లావణ్యకు సీటు కేటాయించింది. .
ఈమె బీసీ వర్గానికి చెందిన మహిళా కావడంతో బీసీ ఓటర్లు అధికంగా ఉన్న మంగళగిరిలో మరోసారి వైసీపీ గెలవడం ఖాయం అని వైసీపీ నేతలు చెబుతున్నారు. పైగా ఆమె మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె కావడంతో స్థానికంగా ఆమెకు మరింత మద్దతు లభించే అవకాశం ఉంది. అయితే మొదటి నుంచి కూడా మంగళగిరిలో వైసీపీకి మంచి పట్టు ఉంది. గత ఎన్నికల్లో లోకేష్ పై ఆళ్ళ రామకృష్ణ రెడ్డి 5 వేల ఓట్ల పైచిలుకు తేడాతో గెలుపొందారు. అందువల్ల ఈసారి ఎన్నికల్లో కూడా అంతకు మించి విజయాన్ని నమోదు చేయాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. అయితే గతంతో పోల్చితే ఈ సారి లోకేష్ కు మంగళగిరిలో మద్దతు పెరిగింది. అయినప్పటికి నియోజక వర్గంలో అన్నీ సమీకరణలను బేరీజు వేసి చూస్తే వైసీపీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది ఆ పార్టీ శ్రేణులు చెబుతున్న మాట. మరి వైసీపీ తరుపున బరిలో ఉన్న మురుగుడు లావణ్య నారా లోకేష్ కు ఎంతవరకు పోటీనిస్తుందో చూడాలి.
Also Read:Jagan:జగన్ హామీలన్ని నెరవేర్చారా?