గుంటూరు కారం మొదట ‘ఎన్టీఆర్’ దేనా?

19
- Advertisement -

సూపర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ‘గుంటూరు కారం’ సినిమా మిక్డ్స్ టాక్ తో మంచి క‌లెక్ష‌న్స్‌ సాధిస్తోంది. ఈ సినిమా రూ.200 కోట్ల క్ల‌బ్ లో జాయిన్ అయిన‌ట్లు మేక‌ర్స్ తెలిపారు. ఫ‌స్ట్ వీక్ పూర్త‌య్యే నాటికి గుంటూరు కారం రూ.212 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు అందుకున్న‌ట్లు వెల్ల‌డించారు. మొత్తానికి ఈ క‌లెక్ష‌న్ల‌తో మ‌హేష్ బాబు త‌న రేంజ్‌ను మ‌రోసారి ప్రూవ్ చేసుకున్నాడు. కానీ, త్రివిక్రమ్ కథల పై మాత్రం బాగా నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ వినిపిస్తోంది. అల వైకుంఠ‌పుర‌ములో త‌ర్వాత త్రివిక్ర‌మ్, ఎన్టీఆర్ కాంబోలో ఓ సినిమా అనౌన్స్ అయిన విష‌యం తెలిసిందే. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ సినిమా ఆగిపోయింది. త‌ర్వాత త్రివిక్ర‌మ్.. మ‌హేష్‌తో గుంటూరు కారం చేశాడు. గుంటూరు కారం రిలీజైన త‌ర్వాత త్రివిక్ర‌మ్, ఎన్టీఆర్‌తో చేయాల‌నుకున్న సినిమా ఇదేన‌ని, క‌థ న‌చ్చ‌క ఈ సినిమాను ఎన్టీఆర్ రిజెక్ట్ చేశాడంటున్నారు. ఇందులో నిజమెంతో మ‌రి. ఒక్కటి మాత్రం నిజం, ఈ కథ మొదట ఎన్టీఆర్ కే చెప్పినట్టు టాక్.

ఏది ఏమైనా ‘గుంటూరు కారం’ సినిమాను ఎన్టీఆర్ తిర‌స్క‌రించాడు. ఇప్పుడు గుంటూరు కారం డిజిటల్ పార్ట్నర్ పై అందరిలో ఆత్రుత, ఆసక్తి బయలుదేరాయి. మరి, ఈ మధ్య బిగ్ బడ్జెట్ మూవీస్ అన్నిటినీ ఎగరేసుకుపోయే నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు గుంటూరు కారం ఓటీటీ రైట్స్ ని చేజిక్కించుకుంది. ఈ డీల్ కోసం నెట్ ఫ్లిక్స్ దాదాపు 110 కోట్లు కోట్ చేసినట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. ఐతే, ఇందులో వాస్తవం లేదు. గుంటూరు కారం ఓటీటీ హక్కుల కోసం నెట్ ఫ్లిక్స్ 70 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Also Read:మా గేమ్ ను ప్రేక్షకులే గెలిపించాలి : గీతానంద్

- Advertisement -