Pawan:జనసేన బలహీనంగా ఉందా ?

26
- Advertisement -

ఏపీలో టీడీపీ జనసేన కూటమి తొలి జాబితా విడుదల చేయడంతో రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీ 94, జనసేన 24 సీట్లలో అభ్యర్థులను కన్ఫమ్ చేశాయి. అయితే సీట్ల ప్రకటన బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అందరి నోట జనసేన పార్టీ గూర్చిన చర్చే జరుగుతోంది. ఏపీలో మూడో ప్రధాన పార్టీగా ఉన్న జనసేనకు కేవలం 24 సీట్లు మాత్రమే కేటాయించడం ఏంటనే సందేహాలు చాలమంది వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీలో కూడా ఈ రకమైన అసంతృప్తి నేతల్లో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారం కోసం పోటీ పడాల్సిన పార్టీ 24 సీట్లతో సరిపెట్టుకోవడంతో జనసేన బలహీనంగా ఉందని పవన్ కూడా భావిస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. .

2019 ఎన్నికల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడం కోసం పవన్ గట్టిగానే శ్రమించారు. వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ వచ్చారు. కౌలు రైతు భరోసా, జనవాణి వంటి కార్యక్రమల్తో ప్రజల్లో కూడా జనసేన పార్టీపై కొంత సానుకూలత ఏర్పడింది. ఇక ఎన్నికల్లో ఈసారి జనసేన పార్టీ కింగ్ మేకర్ పాత్ర పోషించడం ఖాయమనుకునే సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీశాయి. పోటీ చేసిన ఏ ఒక్క స్థానంలో కూడా గెలవకపోగా, కనీసం డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి. తెలంగాణలో ఎదురైన ఈ పరాభవం ఏపీలో గట్టిగానే ఎఫెక్ట్ అయినట్లు తెలుస్తోంది.

అందుకే జనసేన పార్టీ చంద్రబాబు లైట్ తీసుకొని కేవలం 24 సీట్లు మాత్రమే కట్టబెట్టరానే చర్చ జరుగుతోంది. పవన్ కూడా సీట్ల విషయంలో వెనక్కి తగ్గినట్లే తెలుస్తోంది. అయితే రెండో జాబితా విడుదల చేయాల్సి ఉండగా.. ఆ లిస్ట్ లోనైనా జనసేన పార్టీకి సీట్లు పెరిగే ఛాన్స్ లేకపోలేదు. అయితే ఓవరాల్ గా 40 స్థానాలలోపే జనసేనకు సీట్లు ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి తొలి జాబితాలో జనసేనకు సీట్లు తగ్గడంపై రాష్ట్ర రాజకీయాల్లో రకరకాల చర్చలు తెరపైకి వస్తున్నాయి. మరి ఎన్నికల్లో ఈ పార్టీ ప్రభావం ఎంతమేర ఉంటుందో చూడాలి.

Also Read:‘కారు జోరు’ గ్యారంటీ !

- Advertisement -