ప్రస్తుతం ఏపీలో క్రియాశీలకంగా దూసుకుపోతున్న జనసేన పార్టీ తెలంగాణపై కూడా ఫోకస్ చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 25 నుంచి 40 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించడంతో తెలంగాణలో జనసేన పోటీ కన్ఫర్మ్ అయిపోయింది. అయితే ఏపీతో పోలిస్తే తెలంగాణ పరిస్థితులు చాలా భిన్నం.. ఇక్కడ కేసిఆర్ సుపరిపాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎన్నికలు ఏవైనప్పటికి బిఆర్‌ఎస్ ను తప్ప.. ఇతర పార్టీలను ప్రజలు చేసే పరిస్థితి లేదు. ఇప్పటికే ఈ విషయం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బాగానే తెలుసు. ఇక తెలంగాణలో ఇటీవల పురుడు పోసుకున్న వైఎస్ శర్మిల పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ వైపు ప్రజలు అసలు చూసే పరిస్థితే లేదు..
ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా జనసేన కూడా తెలంగాణలో ఎంట్రీ ఇవ్వనుండడంతో ఆ పార్టీ ప్రభావం ఎలా ఉండబోతుందనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రస్తుతం ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన.. తెలంగాణలో కూడా ఆ దోస్తీ కొనసాగిస్తుందా అనే దానిపై కూడా పవన్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో బీజేపీతో తమ పొత్తు ఉండదని, కానీ రాజకీయంగా మద్దతు ఉంటుందని చెప్పుకొచ్చారు. అలాగే ఏ పార్టీ అయిన జనసేన పొత్తు కోరితే సంతోషమే అంటూ పవన్ చెప్పుకొచ్చారు.
అయితే పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న దాని ప్రకారం ఎన్నికల సమయానికి పవన్ బీజేపీతో కలిసే అవకాశాలే ఎక్కువ అనే వాదన వినిపిస్తోంది. ఇక ప్రస్తుతం తెలంగాణలో అధికారం కోసం కమలం పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోన్నప్పటికి.. ప్రజలు మాత్రం బీజేపీని నమ్మే పరిస్థితిలో లేరు. ఈ నేపథ్యంలో పవన్ బీజేపీతో కలిస్తే లాభం కంటే నష్టమే అధికం అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రజానాడీ ప్రకారం ఎన్ని పార్టీలు బరిలోకి దిగిన ప్రజలు మాత్రం బిఆర్‌ఎస్ పక్షాన ఉన్నారనేది ఎవరు కాదనలేని వాస్తవం. ఇది ఇప్పటికే చాలా సార్లు రుజువైంది కూడా. ఏది ఏమైనప్పటికి జనసేన రాకతో తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణలు తెరపైకి రానున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇవి కూడా చదవండి..