వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో వై నాట్ 175 లక్ష్యంతో ఉన్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ ఈసారి అంతకు మించి అనేలా 175 స్థానాల్లోనూ విజయం సాధించి ఎవరికి సాధ్యం కానీ క్లీన్ స్వీప్ చేయాలని వైఎస్ జగన్ ఉవ్విళ్లూరుతున్నారు. అయితే అది అంత సులువైన పని కాదనే సంగతి ఆయనకు కూడా తెలిసిందే. అయినప్పటికి తగ్గేదెలే అంటున్నారు వైఎస్ జగన్. అయితే ప్రస్తుతం ఏపీ వైసీపీ సర్కార్ పై సానుకూలతతో పాటు వ్యతిరేకత కూడా గట్టిగానే ఉంది. మరి ప్రతికూల పరిస్థితుల మధ్య జగన్ భావిస్తున్నట్లుగా క్లీన్ స్వీప్ సాధ్యమేనా అనేది ఆ పార్టీ వర్గాల్లో కూడా వినిపిస్తున్న సందేహం. ఇకపోతే చాలా నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో నెలకొంది. .
దాదాపు 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలను జగన్ నేరుగా పలుమార్లు హెచ్చరించారు కూడా. ఇదిలా ఉండగా మూడు లేదా నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి సీట్ల కేటాయింపు జగన్ ఎలా చేయబోతున్నారనేదే ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పార్టీలో నెలకొంటున్న పరిస్థితులు చూస్తుంటే దాదాపు 70-80 స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే అవకాశం ఉందట. ఇప్పటికే 11 మంది ఇంచార్జ్ ల పదవులు మార్చిన వైఎస్ జగన్ త్వరలెన్ అభ్యర్థుల ఎంపికపై కూడా కసరత్తులు చేసే అవకాశం ఉందట. 175 స్థానాల్లో విజయం సాధించాలంటే ప్రజా వ్యతిరేకత ఉన్నవారిని నిరభ్యంతరంగా పక్కన పెట్టేందుకు జగన్ సిద్దమైనట్లు తెలుస్తోంది. అయితే భారీగా సిట్టింగ్ లను పక్కన పెడితే వారినుంచి పార్టీకి తిగుబాటు ఏర్పడే అవకాశం ఉంది. అప్పుడు పార్టీకి ఇబ్బందులు తప్పవనేది కొందరు చెప్పే మాట. అయినప్పటికి మెజారిటీ స్థానాల్లో సిట్టింగ్ లను మార్చేందుకే జగన్ మొగ్గు చూపుతున్నట్టు టాక్. మరి జగన్ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.
Also Read:IND vs SA T20 :సమం చేస్తారా? సమర్పిస్తారా?