Jagan:జగన్ చూపు.. ఎటువైపు?

52
- Advertisement -

ఏపీలో రాజకీయలు క్షణ క్షణం రసవత్తరంగా మారుతున్నాయి. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనుండడంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల మూడ్ లోకి వచ్చేశాయి. అధికార వైసీపీ వైనాట్ 175 లక్ష్యంతో ఒంటరిగానే బరిలోకి దిగుతుంటే.. మరోవైపు టిడిపి జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో నిలవబోతున్నాయి. అటు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కూడా ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై గట్టిగానే దృష్టి సారిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల పరిణామాలు చూస్తే బీజేపీ కూడా టిడిపి మరియు జనసేన కూటమితో చేతులు కలిపే అవకాశాలు ఉన్నాయి. అటు కాంగ్రెస్ కూడా షర్మిలను రంగంలోకి దించి పార్టీ పూర్వవైభవం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంతటి రసవత్తరమైన రాజకీయరంగంలో వైఎస్ జగన్ నిజంగానే ఒంటరిగా బరిలోకి దిగే అవకాశం ఉందా ? అంటే ప్రస్తుతం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు..

ఎందుకంటే నిన్న మొన్నటి వరకు టీడీపీ జనసేన బీజేపీ కూటమిని జగన్ ఊహించినదే అయినప్పటికి ఇప్పుడు షర్మిల ఎంట్రీ వైసీపీకి తీవ్ర తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పొత్తు వైపు చూడాల్సిన పరిస్థితి రావోచ్చు అనేది కొందరు విశ్లేషకులు చెబుతున్న మాట. బీజేపీ అధినాయకత్వంతో జగన్ కు సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమిలో చేరేందుకు జగన్ సిద్దమౌతారా ? అనే వాదన కూడా వినిపిస్తోంది. కానీ రాష్ట్ర బీజేపీ మాత్రం వైసీపీని విభేదిస్తుండడం గమనార్హం.

ఇక షర్మిల కారణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. అందువల్ల షర్మిల వల్ల నష్టం జరగకుండా ఉండాలంటే ఇండియా కూటమితో వైసీపీ చేతులు కలపాల్సి ఉంటుంది. అయితే జగన్ వెల్కం చెప్పేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం సిద్దంగా ఉంటుందా అనేది కూడా ప్రశ్నార్థకమే. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి జగన్ వైసీపీని స్థాపించిన సంగతి విధితమే. మరి పొత్తు అంశాలు రాష్ట్రంలో హాట్ టాపిక్ అవుతున్న వేళ.. జగన్ మునుపటి మాటకే కట్టుబడి ఉంటారా ? లేదా పొత్తు తప్పనిసరి అని ఎన్నికల సమయానికి దోస్తీకి జై కొడతారా ? అనేది చూడాలి.

Also Read:KTR:సంక్షేమ పథకాల రద్దుకు కుట్ర

- Advertisement -