తినేటప్పుడు నీరు తాగుతున్నారా?

33
- Advertisement -

ఏదైనా ఆహార పదార్థాలు తిన్న తర్వాత లేదా తినేటప్పుడు నీరు కచ్చితంగా తాగుతుంటాము. ఇలా నీరు త్రాగడం వల్ల పెద్దగా ప్రమాదమేమి లేనప్పటికి కొన్ని రకాల పదార్థాలు తిన్న వెంటనే నీరు త్రాగితే పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అరటిపండు, ద్రాక్ష, నారింజ వంటి పండ్లను తిన్న తర్వాత వెంటనే నీరు తాగకూడదట. అలా చేయడం ఏమాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా అరటిపండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కానీ ఇందులో ఉండే కొన్ని రకాల సమ్మేళనాల కారణంగా తిన్న వెంటనే నీరు తాగితే గ్యాస్ట్రిక్, కడుపు నొప్పి వంటి సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందట.

ఇంకా ద్రాక్ష, నారింజ వంటి పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. తద్వారా ఇవి తిన్న వెంటనే నీరు త్రాగితే ఎసిడిటీ బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంకా చాలామంది అన్నం తింటూ నీరు తాగుతూ ఉంటారు. ఇలా చేయడం కూడా ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే అన్నం తో పాటు నీరు త్రాగడం వల్ల కడుపులోని జీర్ణ రసాయనాలు పలచబడి ఆహారం జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి అన్నం తిన్న 15 నిమిషాలు లేదా 20 నిమిషాల తరువాత నీరు త్రాగలి. ఇంకా ఏవైనా మాసాలతో కూడిన ఆహార పదార్థాలు తిన్నప్పుడు కూడా వెంటనే నీరు త్రాగకూడదు. అలా చేయడం వల్ల కడుపులో మంటగా అనిపిస్తుంది. కాబట్టి ఏదైనా తినేటప్పుడు నీరు తాగకుండా కొద్ది సమయం తర్వాత నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలని చెబుతున్నారు నిపుణులు.

Also Read:జింక్ లోపమా..ఇవి తినండి!

- Advertisement -