పాకిస్థాన్‌కు వెళ్లం..తేల్చేసిన టీమిండియా!

121
- Advertisement -

వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్‌ ట్రోఫీ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ టోర్నిలో పాల్గొనేందుకు టీమిండియా పాకిస్థాన్‌కు వెళ్తుందా లేదా అన్న సందేహం అందరిలో నెలకొంది. అయితే ఈ సందేహాలకు తగ్గట్టుగానే పాకిస్థాన్‌కు వెళ్లేదిలేదని బీసీసీఐ తేల్చేయడంతో ఈ టోర్నీ వేదికను మార్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

దుబాయ్ లేదా శ్రీలంకలో టోర్నిని నిర్వహించేలా ఐసీసీ ప్లాన్ చేస్తోంది. ఛాంపియ‌న్స్ ట్రోఫీ వేదిక‌ను మార్చాల‌ని ఐసీసీని బీసీసీఐ కోరడంతో ఈ మేరకు ఐసీసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోండగా దీనిపై అఫిషియల్ క్లారిటీ రావాల్సి ఉంది.

ఫిబ్ర‌వ‌రి 19 నుంచి మార్చి 9 వ‌ర‌కు ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. 8 జ‌ట్ల‌తో కూడిన టోర్నీ షెడ్యూల్‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు త్వ‌ర‌లో ఖరారు చేయ‌నున్న‌ది.పాకిస్థాన్‌లో చివ‌రిసారి 2008లో ఆ దేశంలో ఆడగా ఈ 16 ఏళ్ల‌లో కేవ‌లం ఒక్క‌సారి మాత్ర‌మే రెండు జ‌ట్లు ద్వైపాక్షిక సిరీస్‌ను ఆడాయి. 2012-13లో చివ‌రిసారి ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య క్రికెట్ సిరీస్ జ‌రిగింది.

Also Read;KTR:ఈ మహా నగరానికి ఏమైంది..? 

- Advertisement -