చక్కెర అనేది గ్లూకోజ్, ఫ్రక్టోజ్ కలిగిన ఒక ఘన పదార్థం. తీపి పదార్థాల తయారీలో చక్కెర వాడకం అధికంగా ఉంటుంది. స్వీట్స్ తయారీలోనూ, పిండి వంటలలోనూ, కేకుల తయారీలోనూ మరియు టీ, కాఫీల తయారీలోనూ చాలా చాలా వాటిలో చక్కెరనే ఎక్కువగా వాడుతుంటారు. అయితే చక్కెర ఎక్కువగా తినడం వల్ల షుగర్ వ్యాధి అటాక్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే తినే ఆహార పదార్థాలలో చక్కెర శాతాన్ని తగ్గించాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే చక్కెర ఎక్కువగా తింటే మధుమేహం మాత్రమే కాకుండా ఇంకా చాలా రోగాలు చుట్టుముడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందట. చక్కెరలోని ఫ్రక్టోజ్ కాలేయ సంబంధిత క్యాన్సర్ కు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. .
ఇంకా చక్కెర ఎక్కువగా తినడం వల్ల శరీరంలో వ్యర్థ కొవ్వు శాతం పెరిగే అవకాశం ఉందట. తద్వారా వేగంగా బరువు పెరుగుతారు. అలాగే ఊబకాయం బారిన పడే ప్రమాదం ఉందట. ఇక చక్కెర పదార్థాలను ఎక్కువగా తినే వారిలో రోగనిరోధక శక్తి కూడా మందగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తద్వారా జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు త్వరగా ఎటాక్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా చక్కెర ఎక్కువగా తినే వారిలో అలసట, ఆందోళన, మానసిక ఒత్తిడి వంటి దుస్ప్రభావాలకు కూడా కారణం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా చక్కెర కారణంగా శరీరంలో ఇన్సులిన్ శాతం పెరుగుతుంది. అందువల్ల వైరల్ ఫీవర్, ఫ్లూ వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. అందువల్ల చక్కెర పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read:TTD:నడకమార్గాల్లో భక్తుల రక్షణకు చర్యలు