బీసీసీఐ చీఫ్‌గా హర్భజన్‌!

6
- Advertisement -

బీసీసీఐ చీఫ్‌గా ఎవరు ఎన్నికవుతారో మరికొద్దిరోజుల్లో తేలిపోనుంది. ప్రస్తుత అధ్యక్షుడు రోజర్ బిన్నీ పదవీకాలం త్వరలోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో జరగనున్న బీసీసీఐ సమావేశంలో కొత్త అధ్యక్షుడి ఎన్నికపై నిర్ణయం తీసుకోనున్నారు.

అధ్యక్ష పదవి మరోసారి మాజీ క్రికెటర్‌కే దక్కుతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రధానంగా మాజీ మాజీ క్రికెటర్లు హర్భజన్‌ సింగ్‌, కిరణ్‌ మోరె వినిపిస్తుండగా హర్భజన్‌కే ఛాన్స్‌ దక్కే అవకాశాలు ఎక్కువని తెలుస్తోంది.

బీసీసీఐ అధ్యక్ష పదవి హర్భజన్​కే లభిస్తే మరో వరల్డ్‌ కప్‌ విజేత జట్టు సభ్యుడికి అరుదైన అవకాశం వచ్చినట్లు అవుతుంది. హర్భజన్‌ 2007 టీ20 వరల్డ్​కప్, 2011 వన్డే ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టులో సభ్యుడు. మరోవైపు కిరణ్ మోరె సైతం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కిరణ్‌ మోరె సౌరాష్ట్రకు చెందిన మాజీ ఆటగాడు. క్రికెట్ నుంచి రిటైరైన తర్వాత సెలక్షన్ కమిటీకి ఛైర్మన్‌గా కిరణ్ వ్యవహరించారు. 2019లో యూఎస్‌ఏ క్రికెట్‌కు తాత్కాలిక కోచ్‌గా, డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

Also Read:Mirai:మిరాయ్ డే1 వసూళ్లు

- Advertisement -